Home /News /andhra-pradesh /

VIJAYAWADA AUTO DRIVER FROM VIJAYAWADA PUSHED CAR WITH HIS LEG FOR 7 KILOMETERS BY MOVING IN AUTO RICKSHAW FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada News: కాలితో కారును నెట్టికెళ్లిపోయాడు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్

మహీంద్రా

మహీంద్రా

Vijayawada: మీది విజయవాడా..? మీరు ఎక్కడికైనా పని మీద వెళ్తుంటేనో, ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుంటేనో..రోడ్డు మీద మీ కారు ఆగిపోయిందా? దగ్గరలో ఎక్కడా మెకానిక్‌ షాపు కూడా లేదా? ఏంచేయాలా అని కంగారు పడకుండా… వెంటనే ఈ ఆటోడ్రైవర్‌కు ఫోన్‌ చేస్తే చాలు.

ఇంకా చదవండి ...
    Prayaga Raghavendra Kiran

    మీది విజయవాడా..? (Vijayawada) మీరు ఎక్కడికైనా పని మీద వెళ్తుంటేనో, ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తుంటేనో..రోడ్డు మీద మీ కారు ఆగిపోయిందా? దగ్గరలో ఎక్కడా మెకానిక్‌ షాపు కూడా లేదా? ఏంచేయాలా అని కంగారు పడకుండా… వెంటనే ఈ ఆటోడ్రైవర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. అతను వచ్చి మీ కారును మీకావల్సిన చోటుకు చేరవేస్తాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహీంద్ర. సాధారణ ఆటో డ్రైవర్.. రోజులానే జీవనాధారమైన ఆటో నడుపుకుంటూ విజయవాడ వన్ టౌన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి తన కారు ఆగిపోయిందని.. దగ్గరలో మెకానిక్‌ షాపుకూడా లేదు…ఏం చేయాలో పాలుపోవట్లేదు..కొంచెం సహాయం చేయమని కోరాడు.

    క్యా ఐడియా సర్‌ జీ అంటున్న నెటిజన్లు
    దీంతో మహీంద్రా ఆటోలోని తాడు తీసి కారుకు కట్టి లాగే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో తాను వినూత్నమైన ఆలోచనతో కారును ఏడు కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఎలా అనుకుంటున్నారా? కారు డ్రైవర్‌ను వెళ్లి సీటులో కూర్చుని స్టీరింగ్‌ పట్టుకోమన్నాడు. తను వెళ్లి తన ఆటోలో కూర్చున్నాడు. ఆటో స్టార్ట్‌ చేసి..తన కుడి కాలుతో బలంగా కారుని వెనకనుండి నెట్టాడు. కారు డ్రైవర్‌ను ట్రాఫిక్‌కు తగ్గట్లుగా స్టీరింగ్‌ తిప్పుతూ ఉండమన్నాడు. అంతే తను కాలుతో సపోర్ట్‌ ఇస్తూ..కారును ఏకంగా ఏడు కిలోమీటర్లు తీసుకెళ్లాడు.

    ఇది చదవండి: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..


    సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పూర్తిగా ట్రాఫిక్ టైం, పైగా ఇక విజయవాడ వన్ టౌన్ ప్రాంతం అంటే ఊహాకు కూడా అందని ట్రాఫిక్ ప్రదేశం .అక్కడ నుంచి మహింద్రా తాను ఆటోలో కూర్చుని తన కుడి కాలుతో కారును ఏడు కిలోమీటర్లు దూరంలోని మెకానిక్ షేడ్ కు నెట్టుకుంటూ తీసుకెళ్లడం చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు.

    ఇది చదవండి: ఏపీలో కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్..? ఆ కొండల కింద అంతా బంగారమే..!


    రోడ్డుపై కాస్త ట్రాఫిక్ ఉంటే వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కానీ ఈ ఘటన లో ట్రాఫిక్ లో అంత సాహసోపేమైన పని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. దారి పొడుగునా ఈ చిత్రం చూసిన అనేక మంది వాహనదారులు,పాదచారులు వారెవా..ఏమి ఐడియా అంటూ ప్రశంసిస్తున్నారు. మరి కొంత మంది అసలు ఎంతదూరం తీసుకెళ్తాడో చూద్దాం అంటూ తమ వాహనాలతో ఈ చిత్రం చూసేందుకు మహింద్రాను ఫాలో అయ్యారు. ఇలా తీసుకెళ్లడం రిస్క్‌ అనిపించలేదా అని మహేంద్రాని అడిగితే…ఇలా రోడ్డు మీద కార్లు ఆగినప్పుడు ఆటో సపోర్టుతో కాలుతో నెడుతూ మెకానిక్‌ షెడ్‌కు తీసుకెళ్లడం తనకు అలవాటుగా మారిందంటున్నాడు.

    ఇది చదవండి: ముగ్గురు మిత్రుల వినూత్న ఐడియా.. ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..!


    మహేంద్రా మాటల్లో… ‘వన్ టౌన్ ప్రాంతంలో ఇలా వాహనాలు ఆగినప్పుడు..నన్ను చాలా మంది సహాయం కోరారు. గతంలో ఇలా వాహనాలు మెకానిక్‌ షేడ్ వరకు తీసుకువెళ్లిన అనుభవం ఉంది. నా స్నేహితుల ఆటోలు కూడా ఇలా ఆగినప్పుడు నేను ఇలానే సహాయం చేస్తాను. ఎంతట్రాఫిక్ ఉన్నా రోడ్డు మీద ఆగిపోయిన కార్‌లను క్షేమంగా వాళ్లు అడిగిన ప్లేస్‌కు చేర్చడమే లక్ష్యంగా భావిస్తాను.. అలా చేర్చడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేను.‘ అని అన్నాడు. ఈ వీడియో ఇంకా ఆనంద్‌ మహేంద్రాకు చేరినట్లు లేదు…లేకపోతే ఈ పాటికి ఈ మహేంద్రాకు ఆ మహేంద్రుడి నుంచి ఏదో ఒక ప్రశంసం దక్కేది అంటున్నారు నెటిజన్లు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada

    తదుపరి వార్తలు