Home /News /andhra-pradesh /

VIJAYAWADA APSSDC TO GIVE FREE TRAINING TO 10TH PASS AND FAIL STUDENTS ON AC TECHNICIAN HERE IS THE REGISTRATION PROCESS FULL DETAILS HERE PRN VPR NJ

APSSDC: ఏపీలో టెన్త్ పాస్, ఫెయిల్ అయిన వారికి అలర్ట్.. ఫ్రీ ట్రైనింగ్ తో పాటు జాబ్ గ్యారెంటీ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి.. రేపే లాస్ట్ డేట్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నైపుణ్యాభివృద్ధి సంస్థ (AP State Skill Development Corporation) నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాబ్ మేళాల ద్వారా చదువు పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఏపీఎస్ఎస్డీసీ (APSSDC).. చదువుకోని వారికి కూడా వివిధ ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

ఇంకా చదవండి ...
    Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నైపుణ్యాభివృద్ధి సంస్థ (AP State Skill Development Corporation) నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాబ్ మేళాల ద్వారా చదువు పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఏపీఎస్ఎస్డీసీ (APSSDC).. చదువుకోని వారికి కూడా వివిధ ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ వర్క్స్, మోటార్ మెకానిక్, వివిధ వస్తువుల తయారీలో శిక్షణ కల్పించి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా టెన్త్, పాస్ ఫెయిల్ అయిన వారికి ఉపాధినిచ్చేలా సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది.

    ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు
    రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్‌, హిటాచి కంపెనీలఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఏసి రిపేర్ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన నలబై ఏళ్లు లోపు వారు ఈ శిక్షణకు అర్హులు. విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూన్ ఒకటో తేదీనఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తామనిఅధికారులు తెలిపారు.

    ఇది చదవండి: వేపచెట్టుకు వందేళ్లు..! గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్.. ఆ వేడుకను మీరూ చూడండి..!


    శిక్షణతో పాటు సర్టిఫికెట్‌
    మూడు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణను అర్హులైన అభ్యర్థుల సద్వనియొగం పరుచుకోవాలని సూచించారు. పెరుగుతున్నటెక్నాలజీకు అనుగుణంగాఈ శిక్షణ ఉంటుందని తద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని శిక్షణ కాల అనంతరం సర్టిఫికెట్ కూడా అందిస్తామని హిటాచీ అడ్మిన్‌ రాంబాబు తెలియజేశారు.

    ఇది చదవండి: న‌వంబ‌ర్ లో ఏపీ అసెంబ్లీ ర‌ద్దు..? జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహాం ఇదేనా..? లండ‌న్ లో కీలక భేటీ..?


    ఇప్పటివరకు 10 బ్యాచ్‌లకు శిక్షణ
    2018 నుంచి నేటి వరకు పది బ్యాచ్ లకు శిక్షణ అందించిన అనేక మంది జీవితాలలో వెలుగు నింపారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ కు శిక్షణ నిర్వహించబోతునట్లు హిటాచీ అడ్మిన్‌ రాంబాబు తెలిపారు . గతంలో శిక్షణ పొందిన వారిలో కొంత మంది టెక్నషియన్స్ గా ఉపాధి పొంది వివిధ కంపెనీల లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొంత మంది సొంతగా రిపేర్లు, నిర్వహణ షాపులు ప్రారంభించి మరొకరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

    ఇది చదవండి: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..!


    ఉచితంగా మెటీరియల్‌ పంపిణీ
    పెరుగుతున్న నిరుద్యోగు సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం దోహపడుతుంది. శిక్షణ లో బాగంగా ప్రతి అభ్యర్థికి కంపెనీ, కళాశాల యాజమాన్యల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అభ్యర్థులకు ప్రతిరోజు థియరీ, ప్రాక్టికల్ క్లాసులు కూడా నిర్వహిస్తారు. అలాగే శిక్షణ కు సంబందించిన మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తారు.

    ఇది చదవండి: ఏపీలో సంక్షేమ పథకాలకు కొత్త రూల్..,పెన్షన్, రేషన్ కార్డుదారులకు అలర్ట్


    పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి ధిటుగా శిక్షణ అందించి అభ్యర్థులును ప్రోత్సహిస్తామని, వారి భవిష్యత్తుకు శిక్షణ ఉపయోగ పడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సత్వరమే ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని టెక్నికల్‌ ట్రైనర్‌ సూర్యప్రకాష్‌ విజ్ఞప్తి చేశారు. మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కోసం వివరాల కోసం విజయవాడ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో సంప్రదించి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని టెక్నికల్‌ ట్రైనర్‌ సూర్యప్రకాష్‌ సూచించారు. మీరు సంప్రదించాల్సిన ఫొన్‌ నెంబర్‌ :+91 96188 22761
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, APSSDC, Iti jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు