విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu), మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు నేతలు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి(vasireddy padma) అక్కడికి వెళ్లారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు.. అక్కడకు చేరుకుని వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాసిరెడ్డి పద్మ అక్కడ ఉండగానే చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడిన చంద్రబాబు.. అక్కడే ఉన్న వాసిరెడ్డి పద్మపై ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని వాసిరెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు. తాము కూడా బాధితులకు అండగా నిలుస్తున్నామని ఆమె సమాధానం ఇచ్చారు. నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పక్కన ఉన్న టీడీపీ మహిళా నేత పంచమర్తి అనురాధ.. వాసిరెడ్డి పద్మపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాసిరెడ్డి పద్మ, అనురాధ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా ఈ విషయమై జోక్యం చేసుకోవడంతో గొడవ మరింతగా ముదిరింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాసిరెడ్డి పద్మ మధ్య గొడవ జరిగింది.
పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. చంద్రబాబు ముందే ఈ ఘటన చోటు చేసుకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాజకీయం చేయడం కోసం గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకొంటున్నారని ఆమె టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ముందే విజయవాడ (Vijayawada) సీపీ క్రాంతి రాణాను ఆదేశించినట్టుగా వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Byreddy Siddharth Reddy: ఆయన పార్టీ మారుతున్నారా..? నారా లోకేష్‌తో భేటీపై ఏమన్నారంటే?
AP Politics: కాంగ్రెస్ తో దోస్తీ జగన్ కు కలిసొస్తుందా..? ఈ ప్లాన్ చంద్రబాబుకు లాభమా..? నష్టమా..?
అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు సరిగ్గాలేదన భావించిన కమిషన్.. చంద్రబాబు, బొండా ఉమకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 విచారణకు రావాలని ఆదేశించింది. చంద్రబాబు, బొండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ సమన్లు ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు ఇంకా స్పందించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu