టీడీపీలో వరుస విషాదాలు పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన వార్త నుంచి పార్టీ శ్రేణులు తేరుకోక ముందే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ(MLC) బచ్చుల అర్జునుడు(Batchula Arjunudu)కి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆదివారం ఉదయం గుండె నొప్పి రావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ని విజయవాడ(Vijayawada)లోని రమేష్‌బాబు గుండె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే బీపీ ఎక్కువగా ఉండటం వల్ల అర్జునుడు పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
మరో టీడీపీకి నేతకు హార్ట్ ఎటాక్..
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జును అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డాక్టర్లకు ఫోన్ చేసి అర్జునుడు హెల్త్ కండీషన్ అఢిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించినట్లుగా తెలుస్తోంది.
క్రిటికల్‌గా హెల్త్ కండీషన్..
బచ్చుల అర్జునుడు ప్రస్తుతం ఎమ్మల్సీగా ఉన్నారు. అంతే కాదు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే గతంలో కూడా అర్జునుడికి ఓ సారి హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Heart Attack, TDP