హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: ఈ బిర్యానీకి 40ఏళ్ల హిస్టరీ.. రూ.5తో మొదలై ఇప్పుడు ఇలా..!

Vijayawada: ఈ బిర్యానీకి 40ఏళ్ల హిస్టరీ.. రూ.5తో మొదలై ఇప్పుడు ఇలా..!

X
బెజవాడలో

బెజవాడలో ఫేమస్ గంగూరు పాక బిర్యానీ

Vijayawada: బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అందులోను చికెన్ బిర్యానీ అయితే మహా ఇష్టంగా తింటారు ఫుడ్ లవర్స్. అయితే అన్ని బిర్యానిలలో ఈ బిర్యాని వేరయా అంటున్నారు గంగూరు పాక బిర్యాని నిర్వాహకులు.ఇంతకీ అక్కడ బిర్యానిలో అంత స్పెషాలిటీ ఏముంది..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అందులోను చికెన్ బిర్యానీ (Chicken Biryani) అయితే మహా ఇష్టంగా తింటారు ఫుడ్ లవర్స్. అయితే అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు అంటున్నారు గంగూరు పాక బిర్యాని (Ganguru Paka Biryani) నిర్వాహకులు. సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లలో బాయిలర్ కోడి చికెన్ బిర్యానీ దొరికితే, తమ దగ్గర మాత్రం ఫారం కోడితో చేసే స్పెషల్‌ బిర్యానీ దొరుకుతుంది.. అని అంటున్నారు పాక బిర్యానీ నిర్వహకులు. ఇంతకీ పాక బిర్యానీ ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి అని మీ మదిలో మెదులుతున్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే విజయవాడ సమీపంలోని గంగూరు వెళ్లాల్సిందే.

విజయవాడ , మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు గ్రామంలో హైవే ప్రక్కన ఉన్న జహెర్ షరీఫ్ గంగూరు పాక బిర్యాని హోటల్‌ వివిధ జిల్లాల వారికి కూడా సుపరిచితమే.

ఇది చదవండి: వైజాగ్ వాసులకు అలర్ట్..! ఆ బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీల మోత తప్పదా..?

చిన్న పాకలో మొదలైన బిర్యాని పాయింట్‌

1982 ఏప్రిల్‌లో హజి సాహెబ్ అనే వ్యక్తి గంగూరులో చిన్న పాకలో బిర్యాని తయారుచేసి అమ్మడం మొదలపెట్టారు. ఆ స్పెషల్‌ బిర్యానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు కారణం అక్కడ చికెన్‌ బిర్యానిని ఫారం కోడి మాంసంతో తయారుచేసేవాడు. ఈ కొత్త రెసిపీని ఫుడ్ లవర్స్‌ బాగా అలవాటు పడ్డారు. బిర్యాని తినాలనిపించిన వాళ్లంతా ఆ పాక బిర్యాని సెంటర్‌కే వెళ్లేవాంటే అర్థం చేసుకోండి అక్కడ రుచి వాళ్లకెంత నచ్చిందో..!

ఇది చదవండి: పాడేరు ఘాట్ రోడ్ ప్రయాణం.. అబ్బా ఆ కిక్కే వేరు.. అదిరిపోయే ఎక్స్ పీరియన్స్..!

40ఏళ్ల ప్రస్థానం..

హజి సాహెబ్‌ చిన్న పాకలో ప్రారంభించిన ఈ బిర్యానీ పాయింట్‌ను..ఇప్పుడు తన మనవడు అమీన్‌ షరీఫ్‌ కొనసాగిస్తున్నాడు. కాలానికి తగినట్లుగా కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. దీంతో భోజనప్రియులను ఆకట్టుకునేందుకు… దానికి మరిన్ని హంగులు అద్ది రెస్టారెంట్‌గా మార్చారు. సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు.. ఈ ఫారం కోడి బిర్యానీ రెసిపీని అదే రుచితో ఫుడ్‌ లవర్స్‌కు అందిస్తారు పాక బిర్యానీ నిర్వాహకులు. 1982లో ఐదు రూపాయలతో ప్రారంభమైన పాక బిర్యానీ…నేటికి బడ్జెట్‌ ఫ్రెండ్లీలోనే బిర్యానిని ప్రజలకు అందిస్తున్నారు.

ఇది చదవండి: అక్కడ బిర్యానీ ఒక్కసారైనా తినాల్సిందే..! టేస్ట్ చూస్తే వదిలిపెట్టరంతే..!

40ఏళ్లుగా అదే రుచి..అదే క్వాలిటీ..!

బిర్యానీ తయారు చేయడానికి మాత్రం పాత పద్ధతులు వినియోగిస్తునట్లు తెలిపారు. బిర్యానికి కావల్సిన మసాలాను కూడా ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ రోజుకి బిర్యానీ రుచి మారట్లేదంటే.. కట్టెల పొయ్యి వినియోగించడం ద్వారానే సాధ్యపడుతుందని నిర్వహకులు అమీన్ షరీఫ్ తెలిపారు.

ఇది చదవండి: బిసి బెళా బాత్ ఎప్పుడైనా తిన్నారా..? కన్నడ వంటకం ఏపీలో ఫేమస్..!

స్పెషల్‌ ఎగ్‌ కర్రీ..:

సాధారణంగా వివిధ హోటల్స్‌లో బిర్యానీ తి పాటు షార్వ , కట్టా , గోంగూర వంటివి ఇస్తారు కానీ గంగూరు పాక బిర్యానీ లో మాత్రం స్పెషల్ ఎగ్ కర్రీ అందిస్తున్నాం అంటున్నారు నిర్వహకులు.

కొడాలి నాని ఫేవరెట్ బిర్యాని..!

కేవలం ఫుడ్ లవర్స్ మాత్రమే కాకుండా రాజకీయ నేతలు, సినీ, సీరియల్ తారలు సైతం ఈ స్పెషల్ బిర్యాని కోసం వస్తుంటారు అని నిర్వహకులు తెలిపారు. ఇప్పటికీ నెలలో కనీసం ఒకసారైనా మాజీ మంత్రి కొడాలి నాని ఈ దారిలో వెళ్లేటప్పుడు ఈ స్పెషల్ బిర్యానిని రుచిచూస్తారని షరీఫ్ తెలిపాడు. ఫుడ్ లవర్స్ కోరిక మేరకు ట్రెండుకు తగ్గటుగా పాక బిర్యాని సెంటర్‌లో కొత్త రకం వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంప్రదాయమైన ఫారం కోడి బిర్యానీతో పాటు చికెన్ స్టార్ట్స్ , వివిధ రకాల చికెన్ ఐటమ్స్‌ను కూడా అందిస్తున్నారు.

ఇది చదవండి: వాల్ క్లాక్ లేని రోజుల్లో టైమ్ ఎలా తెలిసేది..? అప్పట్లో అనుసరించే పద్ధతి అదే..!

బిర్యాని టేస్టే వేరయా అంటున్న కస్టమర్లు..!

బ్రాయిలర్ కోడితో మనం ఇంట్లో చేసుకుని తింటుటంటం కానీ ఇక్కడ ఫారం కోడితో దొరికే బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని... కేవలం బిర్యానీ కోసం ఇక్కడి వరకు వచ్చి తిని వెళతాం అని అంటున్నారు కస్టమర్‌ శోభనబాబు. చాలా సార్లు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ అక్కడ స్పెషల్ బిర్యానీ తినాలని అనుకున్నాం కానీ కుదర్లేదు . నా కల ఇప్పుడు నెరవేరింది అని అంటున్నారు ఫుడ్‌ లవర్‌ రమ్య.

కేవలం ఫుడ్ లవర్స్ మాత్రమే కాకుండా విజయవాడ నగారానికి వ్యాపార, వాణిజ్య పనులపై వచ్చే వారు సైతం ఇక్కడ బిర్యాని రుచి చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. ఈ సారి మీరు అటు వైపుగా వెళ్తే ఒక్కసారి ట్రై చేయండి….

అడ్రస్‌ : గంగూరు పాక బిర్యాని, గంగూరు , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్‌-521139.

ఫోన్‌ నెంబర్‌ : 6302340266

Vijayawada Gangur Paka Biryani Map

ఎలా వెళ్లాలి?

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలో ఉంది ఈ రెస్టారెంట్‌. విజయవాడ నుంచి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బిర్యాని పాయింట్‌కు వెళ్లాలంటే ఆటో, బస్సులు అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chicken biryani, Local News, Vijayawada

ఉత్తమ కథలు