Yashwanth, News18, Jaggayyapeta
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాగిజావను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి విద్యార్థులకు రాగి జావాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ రాగిజావను పిల్లలకు అందించడానికి అదనంగా రూ.86 కోట్లను ఖర్చుచేయడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనితో మొత్తానికి పోషకాహారం కొరకు ప్రభుత్వం రూ.1910 కోట్లను కేటాయిస్తుందని చెప్పారు.
ఈ రాగిజావను పిల్లలకు అందించడం ద్వారా వారికి చదువుపై మరింత ఏకాగ్రత పెంచడానికి సహాయ పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించాలనే దృష్టితో ఈ నిర్ణయం తీసుకుందని సర్పంచ్ చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందేలా ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్నిఅందిస్తుంది.
ఇప్పటి పిల్లల్లో ఎక్కువగా కాల్షియమ్, ఐరన్, వంటి పోషక లోపాల వలన వారిలో రక్తహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ఐరన్ మరియు కాల్షియమ్ అనేది రాగిలో అధికంగా ఉంటాయి.కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల్లో ఈ సమస్యలను నివారించడానికి వారానికి మూడు రోజులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం ఈ రాగిజావను అందిస్తుందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada