VIJAYAWADA AP GOVERNMENT ANNOUNCED 10 LAKSH TO VIJAYAWADA RAPE CASE VICTIM AS TWO POLICE OFFICIALS SUSPENDED FULL DETAILS HERE PRN
Vijayawada Rape Case: విజయవాడ గ్యాంగ్ రేప్ పై సీఎం సీరియస్.. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం..
సీఎం జగన్ (పాత ఫొటో)
ఎన్టీఆర్ జిల్లా (NTR District) కేంద్రమైన విజయవాడ (Vijayawada) ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా (NTR District) కేంద్రమైన విజయవాడ (Vijayawada) ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి... వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీచేశారు.
విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్‌ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన 23ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. విజయవాజ సింగ్ నగర్ కు చెందిన శ్రీకాంత్.., ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈనెల 19న తాను పనిచేస్తున్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడే పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఆమెను బంధించి వెళ్లిపోయాడు. గదిలో బాధితురాలిని చూసిన ఒప్పంద కార్మికుడు చెన్న బాబూరావు, అతని స్నేహితుడు పవన్ కలిసి ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అదేరోజు రాత్రైనా కుమార్తె కనిపించకపోవడంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె కనిపించకుండా పోవడానికి ముందు ఆమెకు ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని పోలీసులకు చెప్పారు. దాని ఆధారంగా దర్యాప్తు చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదు.
ఆ తర్వాత శ్రీకాంత్ ఫోన్ నుంచి కాల్ వచ్చినట్లు తెలుసుకొని అతడ్ని విచారించగా.. ప్రభుత్వాస్పత్రిలో వదిలేసినట్లు చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు అక్కడికెళ్లి చూడగా.. యువతిపై పవన్ అనే వ్యక్తి ఆత్యాచారం చేస్తున్నాడు. దీంతో వారు అతడ్ని పట్టుకొచ్చి నున్న పోలీసులకు అప్పగించారు. ఈ ఘోరం విజయవాడలో తీవ్ర కలకలం రేపింది. వివిధ పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని నున్న సీఐ, ఎస్సైని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.