Home /News /andhra-pradesh /

VIJAYAWADA AP BJP CHIEF CHIEF SOMU VEERRAJU MADE SANSATIONA COMMENTS ON YCP LED GOVERNMENT AND CM JAGAN FULL DETAILS HERE PRN

Somu Veerraju: బీజేపీని గెలిపిస్తే మూడేళ్లలో రాజధాని.. రూ.70కే చీప్ లిక్కర్.. సోము వీర్రాజు బంపర్ ఆఫర్..

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. విజయవాడలో బీజేపీ జనాగ్రహ సభలో పాల్గొన్న సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. విజయవాడ లో బీజేపీ జనాగ్రహ సభలో పాల్గొన్న సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని దీమా వ్యక్తం చేశారు. రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. రాజదానిపై ఏడువేల కోట్లు ఖర్చు చేశామన్న వారిని రైతులు నిలదీయాలన్నారు. అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మిందని.. అందుకే ఇక్కడే తాము రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించామని..ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించామన్నారు. అలాగే రాజధాని కోసం వేలకోట్లు ఇచ్చామన్నారు. ఇక ఉత్తరాంద్ర, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.

    ప్రాంతీయ పార్టీలన్నీ కమీషన్లతో కాలక్షేపం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం నిధులిస్తుంటే జగన్,చంద్రబాబు స్టిక్కర్లు వేసి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. స్కూళ్ల బలోపేతానికి కేంద్రం రూ.4వేల కోట్లు ఇస్తే నాడు-నేడు అంటూ ప్రచారం చేస్తున్నారని సోము ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ లాంటి విద్య అందాలనే లక్ష్యంతో విద్యావిధానాన్ని బీజేపీ ప్రభుత్వమే అమల్లోకి తెచ్చిందన్నారు.

    ఇది చదవండి: వైసీపీ ఎంపీ హత్యకు కుట్ర..? సొంతపార్టీ నేతలే స్కెచ్ వేశారా..? బాంబు పేల్చిన మరో ఎంపీ..!


    వైసీపీ హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తాం... ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉందని సోము వీర్రాజు ధీమావ్యక్తం చేశారు.

    ఇది చదవండి: ఆ హీరోలకు పేర్ని నాని కౌంటర్ సీఎంతో చిరంజీవి భేటీపై క్లారిటీ..RRR టికెట్లపై ఏమన్నారంటే..!


    సంక్షేమం అమలులో వైసీపీ కంటే బీజేపీనే ముందుందని ఆయన అన్నారు. జగన్ దగ్గర నవరత్నాలుంటే.. మోదీ దగ్గర 90 రత్నాలున్నాయని చెప్పారు. సీఎం జగన్ పాలన చేతగాక అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని ఎదుర్కొని వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీదన్నారు. ఆత్మనిర్భర భారత్ కింద ఏపీకి రూ.50వేల కోట్లు ఇచ్చామని సోము గుర్తు చేశారు.

    ఇది చదవండి: బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు.. కారణం ఇదే..!


    పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడితే.. ఏపీ పాలకులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ ఏమీ అణాకాని పార్టీ కాదని... తోలు తీసే పార్టీ తమదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంచనా విషయంలో టీడీపీ, వైసీపీ అవినీతికి పాల్పడుతున్నాయన్నారు. రూ.65వేల కోట్లతో ఏపీలో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక రైల్వే లైన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీకి ఇన్నివేల కోట్లు కేటాయిస్తుంటే ప్రత్యేక హోదా అంటూ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    మీ నగరం నుండి (​విజయవాడ)

    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు