Corruption in Durga Temple: దుర్గగుడిలో అవినీతి రాజ్యం.. ఏసీబీ రిపోర్టులో సంచలన నిజాలు

విజయవాడ దుర్గగదుడి ఈవో సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిని అవినీతి మకిలి వీడటం లేదు. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ నివేదికలో సంచలన విషయాలను పేర్కొంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గగుడి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇంద్రకీలాద్రీపై ఏసీబీ దాడులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మవారి సన్నిధిలో జరిగిన అవినీతిపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిపిన సోదాల వివరాలను నివేదికలో పేర్కొన్న ఏసీబీ ఈవో సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. ఈవో సురేష్ బాబు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల వంటి అంశాల్లో ఈవో సురేష్ బాబు అడిట్ అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. చెల్లింపులపై ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఆవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధంగా చెల్లింపులు ఈవో చెల్లింపులు చేసినట్లు తెలిపింది. అలాగే రూల్స్ కు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కాంట్రాక్టులు ఇచ్చారని.. శానిటరీ టెండర్ల కేటాయింపులోనిబంధనలు పట్టించుకోలేదని పేర్కొంది.

  ఈ టెండర్ల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. తక్కువ సొమ్ముకు కేట్ చేసిన స్పార్క్ కంపెనీని పక్కనబెట్టారని ఆరోపించింది. ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియలో కొటేషన్లను లీక్ చేసి మ్యాక్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. అమ్మవారి రథంపై వెండి సింహాల మాయం ఘటనలో మ్యాక్స్ సంస్థ వైఫల్యం సప్ష్టంగా కనిపించింది. ఇప్పటికే అవినీతి వ్యవహారంలో 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయగా... ఈవోపై చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: ఏపీలో 10వేలు దాటిన యాక్టివ్ కేసులు.. జాగ్రత్తగా ఉండాల్సిందే..


  ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

  ఇది చదవండి: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం  అలాగే అమ్మవారి హుండీ లెక్కింపులోని ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. నవరాత్రుల తర్వాత ఇద్దరు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించగా.. వారి దగ్గర నగదు రికవరీ చేసి పంపారే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారులు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక భవానీ దీక్షల విరమణ సందర్భంగానూ అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతంలో అమ్మవారి చీరలు మాయమైన ఘటనపై కూడా ఆలయ అధికారులు, పాలకమండలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
  Published by:Purna Chandra
  First published: