Home /News /andhra-pradesh /

VIJAYAWADA ANDHRA PRADESH WELFARE SCHEMES FOR YSR VAHANA MITRA SCHEMES 10000RS FOR ALL DRIVERS NGS

Good News: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా డబ్బులు.. అర్హత ఏంటంటే..?

డ్రైవర్లకు శుభవార్త

డ్రైవర్లకు శుభవార్త

Good News: ఏపీలో డ్రైవర్లకు శుభవార్త.. ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు పది వేల రూపాయల నగదును బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా వేయనున్నారు. ఈ స్కీమ్ కు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.. ఎప్పటి వరకు అంటే..?

    Good News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వరుసగా రెండు సంక్షేమ పథకాలకు డబ్బులు విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. విద్యార్థుల కోసం.. అమ్మఒడి (Ammavodi).. తాజాగా విద్యాకానుక (Vidyakanuka)లను పేదలకు అందించిన సీఎం జగన్ (CM Jagan).. మరో సంక్షేమ పథకానికి నగదు జమ చేయనున్నారు. ఏపీలోని పేద డ్రైవర్ల కోసం ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర  (Vahana Mitra) పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు  10వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి గడువు ముగిసింది. కానీ సర్వర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇవాళ కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. సమయాన్ని కూడా పెంచారు. దీంతో నేటి రాత్రి వరకు ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. అర్హులు ఆలస్యం చేయకుండా వాహన మిత్ర కోసం ఇవాళ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన వారు వాహనం ఫొటోతో వాలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆ జాబితాను పున: పరిశీలించిన తరువాత.. ఈనెల 13న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందనుంది. సొంత వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లో 10 వేల రూపాయలు జమచేస్తామని రవాణాశాఖ కమిషనర్ పి.రాజబాబు వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్‌లకు సీఎం చేతుల మీదుగా ఈ ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.



    ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరి రోజు సమస్య తలెత్తడంతో.. మరో రోజు గుడువు పెంచారు. అందుకే ఈ అవకాశాన్ని అంతా ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు మాత్రం తమ ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్‌ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి : అధికార పార్టీకి బిగ్ షాక్ తప్పదా..? పవన్ ను కలిసిని ఇద్దరు వైసీపీ నేతలు ఎవరు..?

    ఇక కొత్తగా వాహనాలు కొన్నవారు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఇవాళ రాత్రి లోపు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి 10 వేల రూపాయల సాయం అందిస్తారు. అయితే దీనికి కొన్న కండిషన్లు ఉన్నాయి.. ముఖ్యంగా వేరొక పథకంలో లబ్ది పొందుతున్న వారు, ప్రభుత్వ పించన్ పొందుతున్న వారు ఈ స్కీమ్ కి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు కూడా పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్న వారు వారి ఆటో, ట్యాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయాలి. ఈ నెల 13న సీఎం జగన్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు