హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja Vs Atchannaidu: సై అంటే సై అంటున్న రోజా-అచ్చెన్న.. ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అంటూ సవాల్

Roja Vs Atchannaidu: సై అంటే సై అంటున్న రోజా-అచ్చెన్న.. ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అంటూ సవాల్

Roja Vs Atchannaidu: ఒకరు వైసీపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. మరొకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఇద్దరూ రాజీనామకు సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.. రోజా వేసిన ఛాలెంజ్ కు కౌంటర్ గా.. ఆమె గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అంటూ ప్రతి సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు.

ఇంకా చదవండి ...

  Roja Vs Atchannaidu: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అప్పుడు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ప్రతిపక్షాలన్నీ ముందస్తుగానే ఎన్నికలు అంటూ అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం ముందస్తు లేదంటు 2024 టార్గెట్ లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ జోస్యం చెప్పారు. దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే  రోజా (MLA Roja) స్పందించారు. అచ్చెన్నాయుడు (Atchannaidu) పెద్ద జోక్ చేశారని సెటైర్ వేశారు. తిరుపతి (Tirupati) ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి.. ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని మండిపడ్డారు. మహా అయితే గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు కానీ.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమే అని వ్యాఖ్యనించారు..

  ఇక టీడీపీ వాళ్లకు ఎన్నికలపై మోజు.. సరదా ఉంటే.. వెంటనే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రండి అంటూ సవాల్ విసిరారు. రోజా సవాల్ పై అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో స్పందించారు.. టెక్కలిలో రాజీనామా చేయాలని రోజా సవాల్ విసిరితే.. నగరిలో రాజీనామా చేయాలని అచ్చెన్న ప్రతి సవాల్‌ విసిరారు. అంతేకాదు అక్కడ రోజా గెలిస్తే ఏం చేస్తారో కూడా చెప్పారు. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే..? టీడీపీ లక్ష్యం 160 స్థానాలు.. ఓ మహిళా నాయకురాలు ఏదేదో కామెంట్లు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారు.. వచ్చేవి 160 సీట్లా.. ఓట్లా అంటూ కామెంట్లు చేస్తున్నారని. ఒకవేళ నిజంగా రోజాకు ఆ ధైర్యం ఉంటే..? తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు.

  ఇదీ చదవండి : ఏపీలో ఉన్నది పోలీసులా? రౌడీషీటర్లకు అనుచరులా? ఇంత అరాచకమా అంటూ లోకేష్ ప్రశ్న నారా లోకేష్ (ఫైల్)

  ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు దక్కిందని గుర్తుచేసిన ఆయన.. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేశారని.. ప్రజలు మోసపోయి.. జగన్‌కు ఓటేసి అధికారం కట్టబెట్టారన్నారు.. అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అన్నారు. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారన్న ఆయన.. తెలుగు మహిళా అధ్యక్షురాలైన అనితను వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలు అంటున్నారని అచ్చెన్నీయుగు ఫైర్ అయ్యారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kinjarapu Atchannaidu, MLA Roja

  ఉత్తమ కథలు