Pawan Kumar, Vijayawada, News18
సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి అనుకునే వారైనా.. లేదా మధ్యాహ్నం.. రాత్రి పూటల్లో టిఫెన్ (Tiffen) చేయాలి అనుకున్న వారికి.. ఈ ఫ్యాక్టరీ బెస్ట్ ప్లేస్.. ఫుడ్ లవర్స్ (Food Lovers) తప్పక రుచి చూడాల్సిన టేస్టులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.. ఇది అన్ని హోటల్స్ లా కాదు.. ఇది ఒక ఇడ్లి ఫ్యాక్టరీ (Idly Facotry ) .. అలాగని ఏదో పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటే పొరపాటే.. ఒక టిఫిన్ సెంటర్ కి.. ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు. ఇక్కడ కేవలం ఇడ్లీలు మాత్రమే కాకుండా వాటితో పాటుగా దోశలను కూడా అందిస్తారు. ఒకటి రెండు రకాల ఇడ్లీలు, రెండు మూడు రకాల దోశలు మాత్రమే ఉంటాయి అనుకుంటే చెట్నీలో కాలేసినట్లే.. ఈ హోటల్లో 15 రకాలుకు పైగా ఇడ్లీలు 20 రకాలు పైగా దోశలను అందిస్తున్నాడు దయాకర్.
ఈ ఇడ్లీఫ్యాక్టరీ హోటల్ ముఖ్య ఉద్దేశం.. వెరైటీ ఫుడ్స్ ఇష్టపడే లవర్స్ కు కావాల్సిన టేస్టులు అందించడమే.. బాగా వెరైటీ ఫుడ్స్ తినడానికి ఎక్కువ శ్రద్ద, మక్కువ చూపుతారట. వారిలానే తినాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐటమ్ మాత్రమే దొరుకుతాయి. అలా వెతికి వెతికి విసుగు చెంది ఉంటారు. అనే ఆలోచనతో ఓకే చోట వారికి వీలున్నన్ని వివిధ రకాల టిఫెన్స్ అందిస్తున్నారు ఇడ్లి ఫ్యాక్టరీ హోటల్ వారు.
ఆ హోటల్ విజయవాడ భవాని పురంలో ఉంది.ఆ హోటల్ ని పెట్టి 3 నెలలు అవుతుంది. మొత్తం ఆ హోటల్ లో 6మంది పని చేస్తుంటారు 4 బయట వారే మిగిలిన ఇద్దరు ఆ హోటల్ ఓనర్స్ భార్య భర్త ఇద్దరు కలిసి పనులు చేస్తుంటారు.
ఇదీ చదవండి : సొంత నియోజకవర్గంలో మంత్రికి చుక్కలు.. అసమ్మతికి కారణం ఇదే
దోశల్లో చాలా రకాలు ఉంటాయి. సాదా దోశ, రవ్వదోశ, మసాలా దోశ, కారం దోశ, నెయ్యి దోశ, చోకలెట్ దోశ, ఐస్ క్రీమ్ దోస, పిజ్జా దోస, బాహుబలి దోశ ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఇడ్లీలో రకాలు మీరెప్పుడైనా చూశారా, పోనీ విన్నారా ? అసలు ఇడ్లీలో ఎన్నిరకాలుంటాయో తెలియాలి అంటే విజయవాడలోని భవాని పురంలోని ఇడ్లీఫ్యాక్టరీ హోటల్కి రావాల్సిందే.
ఇదీ చదవండి : రాత్రికి రాత్రే నిర్మాణాలు.. ఖాళీ స్థలం ఉంటే అక్కడ అంతే సంగతి..
ఇడ్లీ చాలా డెడ్లీ టిఫిన్ అని పెదవి విరుస్తారు చాలా మంది. ఎన్నో రకాల ఇడ్లీలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లో. ప్లెయిన్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లి ఇలా దాదాపు చాలా రకాలు అందిస్తున్నారు. ఇన్ని రకాలదోశలు,ఇడ్లీలను రుచితో పాటుగా నాణ్యతని కూడా జోడించి టిఫిన్ని అందిస్తూ అందరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలతోనే టిఫిన్ అందిస్తున్నారు. కొత్తగా హోటల్ని పెట్టినప్పటికి ఒకసారి వచ్చి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తారని నిర్వహకులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Idly, Local News, Vijayawada