K Pawan Kumar, News18, Vijayawada..
Best Farming: వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేస్తున్నారు కొందరు.. వినూత్న పద్ధతుల్లో ప్రయత్నిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో.. ఇప్పుడంతా లాభసాటి వ్యవసాయం కోసం చూస్తున్నారు. అంటే తక్కువ పెట్టుబడి పెట్టి.. ఎక్కువ లాభాలు (Low Investment More Benefits) కావాలి అనుకుంటుకుంటున్నారు. అలాంటి వారికి ఇదే సరైన పంట.. సాధారణంగా గులాబీ పూవులు (Rose Flovers) అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. పూలల్లో రారాజు గులాబీ.. ఏ పూజకైనా, ఏ శుభకార్యానికి ఐన ఎక్కువగా గులాభిలనే ఉపయోగిస్తారు. అంతేకాదు రైతులకు లాభాలు కూడా అందిస్తోంది.
ఈ గులాబీలను ఒక్కో రైతు ఒక్కో రకంగా సాగు చేస్తారు. అంటే ఒకరు 5 ఎకరాలు పొలం తీసుకుని సాగు చేస్తారు కొందరు. ఇంకొందరు 3 ఎకరాలు తీడుకుంటారు. అలా తీసుకుని బాగా కలిసే లాగా దున్నుకోవాలి. మొక్కలు ఒకటిన్నర అడుగుల నుండి రెండు అడుగుల వెడల్పు నిర్మించాలి.
మొక్కకు మొక్కకు కాస్త దూరం గా ఉంచి నాటుతారు ఎందుకంటే మొక్క ఎదిగే గుబురుగా వస్తుంటుంది కాబట్టి అలా నాటుతుంటారు. అలా ఒక్కో మొక్క నుండి ఒక్కో మొక్కకు మూడు అడుగులు వరుస నుండి ఆరడుగుల వ్యత్యాసంలో గులాబీ మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటిన రెండు నెలల నుండే ఈ గులాబీ పూలు పూస్తాయి. పూలు మొగ్గలను ఆరు నెలల వరకు తెంపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన చాలా త్వరగా మొక్క బలంగా తయారవుతుంది.
ఇదీ చదవండి : ఓ రబ్బయ్య.. జంపలకడి జారు మిఠాయా ఈ పాట వెనుక ఇంతక కథ ఉందా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
తర్వాత పూలు కోతకు వచ్చాక పూలను మార్కెట్ కి పంపిస్తారు ఐతే పూలధర ప్రస్తుతం స్వాములు మాలలు వేసుకునే సమయం కాబట్టి. పూల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి దానివల్ల రైతులకు కాస్థ ఎక్కువగానే గిట్టుబాటు ధర వస్తుంది. పండగలు అప్పుడు,పెళ్లిళ్లు అప్పుడు పూలకు ధర ఎక్కువగానే ఉంటుంది.
ఇదీ చదవండి : గంటాకు కలిసివస్తున్న అంశం అదే..? ఆ లెక్కలతోనే డిమాండ్లు పెడుతున్నారా?
రైతుకు ఎకరానికి 30 నుండి 70 కేజీల వరకు పూలు కోసే వారు కూడా ఉన్నారు. నెలకు రైతుకి గడ్డి మందు, పురుగు మందులు అని 10 వేల వరకు ఖర్చు అవుతుంది కానీ నెలకు వారికి వచ్చే లాభం 70 వెల నుండి దాదాపుగా 2 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. ఈ పంట ఒక్కసారి వేస్తే ఎనిమిది సవంత్సరాల వరకు ఉంచుతారు ఐతే ఎనిమిది నెలల వరకు పూలు కాపు వస్తు ఉంటుంది. ఆ తర్వాత ఆ గులాబి మొక్కలను కత్తిరించి వాటికి చిగురు వచ్చేలాగా పంటకు నీరు పెడుతూ, మందులు చల్లుతూ ఉంటారు.
ఇదీ చదవండి : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని వెంటాడుతున్న వివాదాలు.. వారిపై బదిలీ వేటు..!
వీటికి ఎంత లాభం వస్తుందో అలాగే పంటకు తెగుళ్లు వచ్చినప్పుడు అంతే ఎక్కువగా నష్టపోతుంటారు . ఈ పూలు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు కోసి మార్కెట్ లో అమ్ముకుని వస్తుంటారు. అలా ఉదయం 2 గంటలకు లేచి పూలు కొస్తేనే 4 గంటలు వరకు సమయం పడుతుంది. అలాగే మళ్లీ కొత్తగా మొక్కలు కావాలన్న ఉన్న మొక్కతోనే అంటూ కడతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Farmers, Local News, Vijayawada