K Pawan Kumar, News18, Vijayawada
Vijayawada: ఆ ప్రాంతానికి పరిచయం ఉన్నవారైనా.. ఇది ఈ ప్లేసేనా అని కన్ఫ్యూజ్ అవుతారు.. రాత్రి ఖాళీగా కనిపించే ప్రదేశంలో.. తెల్లారేసరికి నిర్మాణాలు వెలిసి కనిపిస్తాయి.. కొన్ని గంటల్లోనూ నిర్మాణాలు చేపట్టేస్తారు.. అక్కడ ఖాళీ జాగా కనిపించడమే పాపం అన్నట్టు ఉంటుంది. కేవలం నిర్మాణాలు చేపట్టడమే కాదు.. కబ్జా చేసిన స్థలానికి దొంగ పత్రాలు సృష్టిస్తారు.. తరువాత వారి పేరుపై బదిలీ చేసుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటు అయిపోయింది. విజయవాడ పశ్చిమ (Vijayawada West) నియోజకవర్గంలో భూ అక్రమాలు పెరిగి పోతున్నాయి. భవాని పురం (Bhavani Puram) లో దాదాపుగా 10 కోట్లు విలువైన అర ఎకరం స్థలాన్ని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు (Vellampalli Srinivasarao) అనుచరులు తమకు ఉన్న అర ఎకరంను కబ్జా చేసారని బాధితులు పోలీసు స్టేషన్ (Police station) లో ఫిర్యాదు చేశారు.
భవానీ పురం కాంబే రోడ్ లో రోడ్ నెంబర్ 73/1లో అర ఎకరం లో ఈ భూమిలో 0.55 సెంట్లు భూమిని ఇమాంబే అనే మహిళకు అత్త ఇంటి వారి నుండి వచ్చింది. ఇమాంబే చాలా కాలం క్రితమే మరనించింది. ఆవిడకు ఏడుగురు సంతానం వారిలో ముగ్గురు చనిపోయారు మిగిలిన వారు జీవించి ఉన్నారు వీరందరికీ సంబంధిత స్థలంలో వాటా ఉంది ఇమాంబే భూమిని తన భర్త ద్వారా సకల హక్కులుతో దస్తా వీజులు పొందారు. సదరు స్థలాన్నీ భవాని పురానికి చెందిన కాసుల వెంకట నారాయణ 1986 అతడు కొన్నట్టుగా పత్రాలు సృస్టించారు.
వంగవీటి రంగా గారి హత్య జరిగినప్పుడు జరిగిన అల్లర్లలో తాలూకా ఆఫీసులో ఉన్నటువంటి రికార్డులు అన్ని కాలి పోయాయి. అనంతరం ఆస్తులు అన్నిరీకన్స్ట్రక్షన్చేయించుకోమని రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు. దాన్ని ఆసరాగా తీసుకొని వెంకట నారాయణ, ఆత్మకూరి వెంకట దుర్గ రామ కృష్ణ, ప్రకాశరావు చిన్ని, పూర్ణవుతి పేరుపై పత్రాలు సృష్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి : కూతురుని కూడా వదలరా? ట్రోల్స్ పై కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా .. అసలు ఏం జరిగింది అంటే?
మరో పక్క అర్బన్ ల్యాండ్ సీలింగ్ కంపిటేటివ్ అథారిటీ నుండి స్థలం అమ్ముకోడానికి అనుమతి కూడా పొందారు. దాని హక్కు దారులైన మౌలాలి ఈ ఫిబ్రవరిలో పోలీసులుకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు. ఈ కేస్ కోర్టులో నడుస్తుండగానే అక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు
ఇదంతా వెల్లంపల్లి అండతోనే కాసుల నారాయణ కుమారులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. నాలుగు రోజులు క్రిందట వివాదాస్పద స్థలంలో నారాయణ కుమారులతో వెల్లంపల్లి అనుచరులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వీఎంసీ అధికారులు నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్న రాజకీయ ఒత్తిడి ల కారణముగా పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్థలానికి వారసులు అయిన మౌలాలి భవనీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పట్టించుకోకుంటే నిరసన చేస్తామనడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేయకుండా స్థలానికి అసలైనాఆధారాలు కోసం విచారణ చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Vijayawada