హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Intermediate Board Notice: ఆ లెక్చరర్ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. చైతన్య కాలేజ్ భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు

Intermediate Board Notice: ఆ లెక్చరర్ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. చైతన్య కాలేజ్ భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు

శ్రీ చైతన్య కాలేజ్ కు నోటీసులు

శ్రీ చైతన్య కాలేజ్ కు నోటీసులు

Intermediate Board Notice: ఆ లెక్చరర్ చేసిన పని చూసి.. అంతా షాక్ అయ్యారు. విషయం విద్యాశాఖ వరకు వెళ్లడంతో.. చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Intermediate Board Notice: ఆవేశాన్ని కొందరు అదుపు చేసుకోలేక కష్టాలు తెచ్చుకుంటున్నారు. తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు.. ఓ లెక్చరర్ (Lecturer) వచ్చిన ఆవేశం.. ఇప్పుడు ఆ క్యాంపస్ మూతపడే దిశగా అడుగులు పడేలా చేసింది. తాజాగా విజయవాడ (Vijayawada) లో బెంజ్‌ సర్కిల్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల (ChaitanyaCollege) భాస్కర్‌ భవన్‌ క్యాంపస్‌లో ఓ లెక్చరర్ విద్యార్థిని కాలితో తన్నిన అంశం పెద్ద చర్చకు దారి తీసింది.  క్లాస్‌ రూమ్‌లో మాట్లాడాడని ఓ విద్యార్థిని అధ్యాపకుడు చెంపలు వాయించాడు అక్కడితోనే అగలేదు.. కేవలం క్లాస్‌ రూమ్‌లో మాట్లాడాడని ఓ విద్యార్థిని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నాడు.. తిట్ల దండకం కురిపించాడు.

  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆ లెక్చరర్ తీరుపై మండిపడుతున్నారు. స్టూడెంట్ మాట్లాడితే ఇలా విరుచుకుపడతార.. అసలు ఆ లెక్చరర్ మనిషేనా అని మండిపడుతున్నారు. ఇలాంటి వారు కాలేజ్ లో ఉంటే.. విద్యార్థులు ఎలా సంతోషంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

  ఈ విషయం కాస్త ఏపీ ఇంటర్‌ బోర్డ్‌ వరకు చేరింది. దీంతో ఇంటర్‌ బోర్డ్‌ చర్యలకు పూనుకుంది. శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్ కు ఏపీ ఇంటర్‌ బోర్డ్‌ జాయింట్‌ సెక్రటరీ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. దాడి ఘటనలో కాలేజి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సరైన వివరణ ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

  ఇదీ చదవండి : తిరుమలలో అన్న ప్రసాద వితరణ ఎప్పుడు ప్రారంభమైంది? అన్నదాన ట్రస్టుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయి..? రోజు ఎంతమంది తింటారో తెలుసా?

  ఈ విషయమై ఇంటర్ బోర్డ్‌ విద్యామండలి జాయింట్ సెక్రటరీ జీఎస్ఆర్ కృష్ణారావు మాట్లాడారు. దీనిపై సాయంత్రం ఇంటర్మీడియట్ విద్యామండలికి ఫిర్యాదు వచ్చింది. లెక్చలర్ రవికుమార్, ప్రిన్సిపాల్ దగ్గర వివరాలు తీసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ రవికుమార్, చైల్డ్ లైన్ అధికారులతో విచారణ చేశామన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

  ఇదీ చదవండి : పాపకు తన పోలికలు రాలేదని తండ్రి కిరాతకం.. అసలు మ్యాటర్ అదేనా..?

  ఈ వ్యవహారాన్ని ఇంత ఈజీగా వదలేలా లేదు ఇంటర్ మీడియట్ బోర్డు.. ఎందుకంటే ప్రజల నుంచి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవలి.. ఇలాంటి లెక్చర్లు ఎవరు ఉన్నా.. వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. నిజంగానే కాలేజ్ పైనా.. లేదా ఆ లెక్చరర్ పై చర్యలు తీసుకంటారా లేద నోటీసులు ఇచ్చి వదిలేస్తారా అన్నది చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Colleges, Vijayawada

  ఉత్తమ కథలు