Home /News /andhra-pradesh /

VIJAYAWADA ANDHRA PRADESH HIGH COURT GIVE GREEN SIGNAL TO ELURU MUNICIPAL CORPORATION ELECTION COUNTING FULL DETAILS HERE PRN

AP Municipal Elections: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలకు గ్రీన్ సిగ్నల్... కౌంటింగ్ ఎప్పుడంటే..

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే 3 డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ.. మ్యాజిక్ ఫిగర్ పై ధీమాగా ఉంది.

    ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల హడావిడి నెలకొంది. పోలింగ్ జరకపోయినా ఓ ఎన్నికకు సంబంధించి ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్పొరేషన్ ఫలితాలపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాల ప్రకటించాలని తీర్పున్నిచ్చింది. దీంతో ఈనెల 25న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగిన అన్ని డివిజన్లలో అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ తీవ్రంగా పోటీపడ్డాయి. మూడు పార్టీలు ఏలూరు కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుపై అధికార వైసీపీ ధీమాగా ఉంది. విజయవాడ, విశాఖ, తిరుపతి సహా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అన్ని కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకోగా.. ఏలూరు కూడా అధికార పార్టీ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత కౌంటింగ్ జరుగుతుండటంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.

    ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకూ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో మూడు డివిజన్లను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న జరిగాయి. కొత్తగా విలీనమైన పంచాయతీలతో కలిపి ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 2,88,951 మంది జనాభా ఉన్నారు. వీరిలో 2,47,631 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ఇది చదవండి: మహిళల ఖాతాల్లో వైఎస్ఆర్ కాపునేస్తం నగదు జమ.. ఇలా చెక్ చేసుకోండి..


    గత ఏడాది జనవరిలో చొదిమెళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. ఐతే విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని.. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరబాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకర్టు స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం, ఎస్ఈసీ సవాల్ చేయగా.. ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ లాక్ డౌన్... ఉదయం 10గంటల వరకే పర్మిషన్.. ఎక్కడంటే..


    ఐతే అప్పట్లో ఫలితాలు వెలువరించవద్దని ఆదేశించిన కోర్టు.. తాజాగా ఓకే చెప్పింది. దీంతో ఫలితాల ప్రకటనకు మార్గం సుగగమైంది. ఇప్పటికే 3 డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ.. మ్యాజిక్ ఫిగర్ పై ధీమాగా ఉంది. కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Municipal Elections, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు