హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSR Awards: గవర్నర్, సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆవార్డుల ప్రదానం.. జగన్ ఏమన్నారంటే..!

YSR Awards: గవర్నర్, సీఎం చేతుల మీదుగా వైఎస్ఆర్ ఆవార్డుల ప్రదానం.. జగన్ ఏమన్నారంటే..!

అవార్డులు ప్రదానం చేస్తున్న గవర్నర్, సీఎం

అవార్డులు ప్రదానం చేస్తున్న గవర్నర్, సీఎం

కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డులను ఎంపిక చేసినట్లు సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) తెలిపారు. నేలపై నుంచి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్ఆర్ (YSR) అని.. అలాంటి వ్యక్తి పేరుమీద అన్ని రంగాల్లో తెలుగునేలకు పేరు తీసుకొచ్చిన వారిని గౌరవించుకునేందుకు ఈ అవార్డులిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhr Pradesh) ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా అంకిస్తున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను (YSR Life time Achievement Awards) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhushan Harichandan), ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రదానం చేశారు. విజయవాడ (Vijayawada) లోని 'A' కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, అధికారులతో పాటు సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్... కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేలపై నుంచి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని.. అలాంటి వ్యక్తి పేరుమీద అన్ని రంగాల్లో తెలుగునేలకు పేరు తీసుకొచ్చిన వారిని గౌరవించుకునేందుకు ఈ అవార్డులిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు.

ఇక తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడ్ని ప్రార్థిస్తున్నానన్న గవర్నర్.. ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ వైద్య వృత్తిలో ఉన్నా.. వ్యవసాయం, విద్యారంగాల అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్నవారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇది చదవండి: భర్తకు పోటీగా బరిలో దిగిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ కోర్టులో అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..


అవార్డు గ్రహీతల వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రస్టులు

1. ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ(తూర్పుగోదావరి)

2. సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైఎస్సార్‌ జిల్లా

3. సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం)

4. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – పుట్టపర్తి(అనంతపురం)

5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైఎస్సార్‌ జిల్లా

6. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) – అనంతపురం

7. గౌతమి రీజనల్‌ లైబ్రరీ – తూర్పుగోదావరి

8. మహారాజా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ – విజయనగరం

రైతులు

9. స్వర్గీయ పల్లా వెంకన్న – కడియం(తూర్పుగోదావరి)

10. మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం

11. ఎంసీ రామకృష్ణారెడ్డి – అనంతపురం

12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం

13. విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా జిల్లా

14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా

15. ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు

16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం

17. ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫ్మారింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – విశాఖపట్నం

18. వల్లూరు రవికుమార్‌ – కృష్ణా జిల్లా

19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా

కళలు–సంస్కృతి

20. పొందూరు ఖద్దర్‌(ఆంధ్రాపైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం

21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం

22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం

23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు

24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్‌ జిల్లా

25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా

26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం

27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ

28. సవర రాజు(సవర పెయింటింగ్స్‌) – శ్రీకాకుళం

29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం

30. ధర్మాడి సత్యం(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) – తూర్పుగోదావరి

31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి

32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి

33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా

34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా

35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు

36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్‌) – కర్నూలు

37. బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్టిజన్స్‌ సొసైటీ – చిత్తూరు

38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు

39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం

సాహిత్యం

40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్‌) – శ్రీకాకుళం

41. కత్తి పద్మారావు – గుంటూరు

42. రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా

43. బండి నారాయణ స్వామి – అనంతపురం

44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్‌ జిల్లా

45. కొలకలూరి ఇనాక్‌ – గుంటూరు

46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు

జర్నలిజం

47. ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా

48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు

49. స్వర్గీయ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు

50. స్వర్గీయ కె.అమరనాథ్‌ – పశ్చిమగోదావరి

51. సురేంద్ర (కార్టునిస్ట్‌) – వైఎస్సార్‌ కడప జిల్లా

52. ఇమామ్‌ – అనంతపురం

వైద్య–ఆరోగ్య విభాగం

53. డాక్టర్‌ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్‌) – నెల్లూరు

54. డాక్టర్‌ కె.కృష్ణ కిషోర్‌(ఈఎన్‌టీ ప్రొఫెసర్‌) – తూర్పుగోదావరి

55. లక్ష్మి(స్టాఫ్‌ నర్స్‌) – విజయవాడ

56. కె.జోతిర్మయి(స్టాఫ్‌ నర్స్‌) – అననంతపురం

57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్‌ నర్స్‌) – విశాఖపట్నం

58. ఎం.యోబు(మేల్‌ నర్స్‌) – వైఎస్సార్‌ కడప జిల్లా

59. ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ కడప జిల్లా

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, AP governor viswabhushan, YSR

ఉత్తమ కథలు