No Jeans T Shirts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పలు విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా బోధనాస్పత్రుల్లో ఉండే సిబ్బంది వస్త్రధారణతో పలు నియమ, నిబంధనలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ (DME) కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో డ్రస్ కోడ్ (Dress Code) ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బోధనాస్పత్రుల్లో ఉండే సిబ్బంది వస్త్రధారణతో పలు నియమ, నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
డీఎంఈ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో డ్రస్ కోడ్‌ను ప్రస్తావించారు. వైద్య విద్యార్థులు, వైద్యుల డ్రస్ కోడ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
మహళా వైద్యులు, వైద్య విద్యార్థినులు తప్పనిసరిగా చీర గానీ చుడీదార్ గానీ ధరించాలని, జుట్టు వదులుగా వదిలేయకుండా ముడి వేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా విధుల్లో ఉన్నప్పుడు యాప్రాన్‌ను ధరించడంతో పాటు మెడలో స్టెతస్కోప్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. మగవాళ్లు గడ్డం గీసుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడి డ్రస్ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : ఓ రబ్బయ్య.. జంపలకడి జారు మిఠాయా ఈ పాట వెనుక ఇంతక కథ ఉందా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
బోధనాసుపత్రులకు ఎవరైనా వచ్చిన రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవాల్సి వస్తే.. హెల్పర్స్ లేరనే కారణంతో తిరస్కరించొద్దని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రితో పాటు మిగిలిన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్యుల డ్రెస్ కోడ్ నిబంధనలపై సర్క్యులర్‌ను జారీ చేశారు. దీంతో పాటు బోధనాస్పత్రుల్లో ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్‌ను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు రోజులో మూడుసార్లు.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా హాజరు వేయాలని సూచించారు. అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎన్రోల్ కాని వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గంటాకు కలిసివస్తున్న అంశం అదే..? ఆ లెక్కలతోనే డిమాండ్లు పెడుతున్నారా?
బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బోధనాస్పత్రులకు పంపిన సూచనల్లో ఈ డ్రెస్ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించకపోవడంతో ఈ ఆదేశాలు జారీచేసినట్టుగా పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Doctors, Students