VIJAYAWADA ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES READY TO ANOTHER FIGHT FOR CPS CANCELLED NGS
No GPS Only OPS: మళ్లీ ఉద్యోగ సంఘాల పోరు బాట.. సీపీఎస్, జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్
ప్రతీకాత్మకచిత్రం
No GPS Only OPS: మళ్లీ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వంగా ఏపీలో పరిస్థితి మారనుందా..? పీఆర్సీ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్న ఉద్యోగులు.. మళ్లీ రోడ్డు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా.. ఈసారి రెట్టించిన విధంగా ఉద్యమం చేయాలని నిర్ణయించారా..? అసలు ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటి..? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి అనుకుంటోంది.
No GPS Only OPS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)పై మరో పోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారా..? అసలు ఉద్యోగుల డిమాండ్ ఏంటి.. మోన్న పీఆర్సీ (PRC)విషయంలో సుదీర్ఘ చర్చల తరువాత.. ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు (Employees Union) మళ్లీ ఉద్యమ బాట ఎందుకు పడుతున్నాయి? ఈ సారి తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించాయా.? అంటే అవుననే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎందుకంటే.. సీపీఎస్ (CPS) రద్దు.. ఓపీఎస్ (OPS) పునరుద్దరణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswaralu). ఎందుకంటే ఇప్పటికే పీఆర్సీ చర్చల్లో ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కూడా అలానే చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (Bandi Srinivasarao). జీపీఎస్ ను తెస్తే వ్యతిరేకిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. అవసరం అయితే ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
జీపీఎస్ సంప్రదింపుల సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు స్పందించారు. జీపీఎస్ వద్దు ఓపీఎస్ మాత్రమే కావాలని మంత్రుల కమిటీతో చెప్పామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె ఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. గత సమావేశానికి కొనసాగింపుగా.. ఈ సమావేశం కొనసాగింది అన్నారు. మళ్లీ చర్చలకు వెళ్లేందుకు తమకు అభ్యంతరం లేదని.. కానీ సీపీఎస్ రద్దు తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు.. అలాగే ప్రభుత్వం సూచిస్తున్న జీపీఎస్ కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. జీపీఎస్ ప్రతిపాదనలు సహేతుకంగా లేవని మంత్రుల కమిటీతో చెప్పామన్నారు. సీపీఎస్ రద్దు అని చెబితేనే ఇకపై సమావేశానికి రావాలని నిర్ణయించామన్నారు.
తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని కమిటీతో స్పష్టంగా చెప్పామన్నారు. జీపీఎస్ పేరుతో సమావేశాలు పెడితే ఇక వచ్చేది లేదని చెప్పారు. సీపీఎస్ రద్దు అయి ఓపీఎస్ వచ్చే వరకు తమ పోరాటం ఆ ఉద్యోగుల తరపున కొననసాగిస్తామంటున్నారు. 2003లో నియామకంపొందిన వారికి ఓపీఎస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో టక్కర్ కమిటీ రిపోర్టును అన్ని ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఓపీఎస్ లు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఓపీఎస్ పై చర్చిస్తేనే మీటింగ్ కు వస్తాము. ఆర్టీసీ ఉద్యోగులకు ఈరోజుకు పాత జీతాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పే రోల్ లో ఐఆర్ కాలంను తిరిగి ఉంచాలని కోరామన్నారు బొప్పరాజు. సీపీఎల్ లో ఉన్న అవలక్షణాలు అన్నీ జీపీఎస్ లోనూ ఉన్నాయని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టికల్ 309 ప్రకారం సీపీఎస్ నుండి రాజస్తాన్ బయటకు వచ్చిందన్నారు. ఓపీఎస్ ప్రతిపాదనలపై నెక్స్ట్ మీటింగ్ జరగాలి. లేని పక్షంలో తాము హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.