Home /News /andhra-pradesh /

VIJAYAWADA ANDHRA PRADESH CRIME NEWS WIFE COMPLAINT ON HER HUSBAND TO BYTE HER CHEEK NGS GNT

Crime News: దంపతుల కేసుతో పోలీసుల పరేషాన్.. బుగ్గ కొరికేశాడంటూ భర్తపై ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

బుగ్గ కొరికాడన భర్తపై భార్య ఫిర్యాదు

బుగ్గ కొరికాడన భర్తపై భార్య ఫిర్యాదు

Crime News: నిత్యం పోలీస్ స్టేషన్ కు ఎన్నో కేసులు వస్తుంటాయి.. అందులో భార్య,భర్తల కేసులు కూడా చాలానే ఉంటాయి. భర్తపై భార్య, భార్య పై భర్తలు ఫిర్యాదులు చేయడం కామన్.. తాజా ఓ విచిత్ర కేసు వచ్చింది.. అసలు విషయం తెలిసి వారంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Crime News: సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే పలు కేసులతో నిత్యం బిజీగా ఉంటుంది.. అయితే ఎప్పుడూ సీరియస్ కేసులే కాదు.. కొన్ని సిల్లీ కేసులు కూడా వారిని ఇబ్బంది పెడుతుంటాయి. కొందరు కోడి పోయిందని.. మరికొందరు తమ కుక్క పోయిందని.. ఈ మధ్య అయితే పెన్సిల్ పోయింది.. పెన్న పోయింది.. మా నాన్న తిట్టారని ఇలా వివిధ రకాల కేసులు.. పోలీసులకు చికాకు తెప్పిస్తుంటాయి. ఇక పోలీస్ స్టేషన్ కు వచ్చే కేసుల్లో ఎక్కువ భార్య, భర్తల కేసులే (Family Cases) వస్తుంటాయి. అందులోనూ భర్త (Husband) ఇంటి వారు వేధించారని.. వరకట్నం కోసం వేధిస్తున్నారని.. భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని.. కనిపించటకుండా వెళ్లి పోయడని.. లేక అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇలాంటి కేసులు ఎక్కడో ఒక చోటు నమోదవుతూ ఉంటాయి.  సీరియస్ విషయాల్లో కేసులు తప్పవు.. కానీ భార్యాభర్తలు (Wife and Husband) అన్నాక అలకలు, గొడవలు సాధారణమే. అసలు అలాంటి అలకలు లేని సంసార జీవితం బోరింగ్ కూడా. ఆ అలకలు, గొడవలు చిన్నచిన్నవే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి.

    మొగుడుపెళ్లాల బంధం చాలా సున్నితమైంది. దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. అలా చేస్తే వారి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమర్థంగా తట్టుకోగలరని పెద్దలు చెబుతుంటారు. కానీ భార్య, భర్తలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అనుకుంటారు.  తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త బుగ్గ కొరికేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ కేసు గురించి వినగానే పోలీసులు షాక్ అయ్యారు.



    బాధితురాలి ఫిర్యాదుతో బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కానూరు కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతను మద్యానికి బానిసయ్యాడు. మందు తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడ్డాడు. అలా ఇద్దరి మధ్య మొదలైన వివాదం మరింత పెద్దదైంది.

    ఇదీ చదవండి : సిస్టర్ అంటూ మాట కలుపుతాడు.. ఫోటోలు దిగుతాడు.. తరువాత ఏం చేస్తాడంటే?

    వారిద్దరి మధ్య వివాదం మరింతగా ముదిరింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అలా గొడవ పెరగడంతో ఆవేశంగా ఊగిపోయాడు రాంబాబు.. తనకే ఎదురు చెబుతావా అంటూ ఆవేశంలో ఊగిపోయిన రాంబాబు స్రవంతి బుగ్గను కొరికేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు