Home /News /andhra-pradesh /

VIJAYAWADA ANDHRA PRADESH CRIME NEWS ROAD ACCIDENT IN KRISHNA DISTRICT FOUR PEOPLE NO MORE NGS

Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: కృష్ణా జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కల్వర్టును కారు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా.. నలుగురి మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.

    Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాద వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా (Krishna District)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న ఓ కారు జగ్గయ్యపేట మండలం గౌరవరం దగ్గర  కల్వర్టను ఢీకొట్టింది. వెంటనే అదుపు తప్పి పల్టీలు కొడుతూ పడిపోయింది.  ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నుజ్జు నుజ్జు అయ్యింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.. ప్రమాదన ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

    హైదరాబాద్‌ (Hyderabad) నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం  రోడ్డు దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

    ఇదీ చదవండి : మొన్న ఇంటర్.. నేడు పదో తరగతి పరీక్షలు వాయిదా..? మే 9 నుంచి ప్రారంభం?

    విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో సాగర్ కెనాల్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టుని ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Road accident, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు