• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VIJAYAWADA ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY LAUNCHED 2ND PHASE OF JAGANANNA VIDYA DEEVENA SCHEME FULL DETAILS HERE PRN

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు శ్రీకారం.. తన లక్ష్యం అదేనన్న సీఎం జగన్

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు శ్రీకారం.. తన లక్ష్యం అదేనన్న సీఎం జగన్

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

పేద విద్యార్థులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని.. పాదయాత్రలో ఇచ్చిన మాటపై తాను నిలబడుతున్నాని సీఎం జగన్ (YS Jagan) అన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని రెండో విడతలో అమలు చేయడం ప్రారంభించింది. విద్యాసంవత్సరంలో మొదటి త్రైమాసికానికి చెందిన నగదను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. మొత్తం 10.88 లక్షల మంది విద్యార్థులకు రూ.671 కోట్లు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి త్రైమాసికానికి క్రమం తప్పకుండా విద్యార్థులకు సాయం చేస్తున్నట్లు వివరించారు. అలాగే గత ప్రభుత్వం రూ.1880 కోట్ల బకాయిలు పెట్టి వెళ్తే.. వాటిని తీర్చామన్నారు. 2019-20కి సంబంధించి పూర్తి రీయింబర్స్ మెంట్ కోసం రూ.4,208 కోట్లు కాలేజీ యాజమాన్యాలకు చెల్లినట్లు జగన్ చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.4,879 కోట్లు ఖర్చు చేశామన్నారు. గతంలో నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించామని.. ఈసారి మాత్రం తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు.

    గత ఏడాది 10.11 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరి... ఈ సంఖ్య 77 వేలు పెరిగి... 10 లక్షల 88 వేల మందికి లబ్ధిచేకూరుస్తన్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 9 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లో నగదు వేస్తున్నట్లు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని ధైర్యం మనం చేస్తున్నామని.. పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చామని.. ప్రభుత్వం తోడుగా ఉందనే భావనను విద్యార్థులు, యాజమాన్యాలకు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పథకాన్ని అమలు చేసతున్నట్లు తెలిపారు. తల్లులే స్వయంగా కాలేజీకి వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీల్లో పరిస్థితుల గురించి తెలుసుకునే అవకాశముంటుందని చెప్పారు.

    రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలోపు పిల్లలను అంగన్ వాడీలో చేర్చే సమయం నుంచి ఉన్నతవిద్య చదివే వరకు అన్ని రకాలుగా విద్యావంతులుగా తీర్చుదిద్దుతున్నట్లు జగన్ వెల్లడించారు. నాడు నేడు కింద అంగన్ వాడీలు, పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. చిన్నపిల్లలకు తమ మేనమామ ఉన్నాడన్న భరోసా కల్పిస్తున్నట్లు జగన్ తెలిపారు. పిల్లల చదువుల వల్ల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు మాట నిలబెట్టుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    జగనన్న విద్యాదీవెన పథకం కింద ఆర్ధికసాయాన్ని ఏడాదికి నాలుగు విడతల్లో సాయం చేస్తోంది. ఏప్రిల్ 19న మొదటి విడతను ప్రారంభించిన ప్రభుత్వం.. జూలైలో రెండో విడత, డిసెంబర్లో మూడో విడత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నగదు జమ చేయనున్నారు.
    Published by:Purna Chandra
    First published: