హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vanijya Utsav-2021: ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్... సీఎం జగన్ కీలక ప్రసంగం...

Vanijya Utsav-2021: ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్... సీఎం జగన్ కీలక ప్రసంగం...

వాణిజ్య ఉత్సవం-2021 ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

వాణిజ్య ఉత్సవం-2021 ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్వర్గధామమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of doing Business) లో నెంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం విజయవాడ (Vijayawada) ఎస్.ఎస్ కన్వెన్షన్ సెంటర్లో వాణిజ్య ఉత్సవం-2021ను (Vanijya Utsav-2021) ఆయన ప్రారంభించారు.

ఇంకా చదవండి ...

  పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్వర్గధామమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) న్నారు. మంగళవారం విజయవాడ (Vijayawada) ఎస్.ఎస్ కన్వెన్షన్ సెంటర్లో వాణిజ్య ఉత్సవం-2021 (Vanijya Utsav-2021)ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు,పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఎక్స్ పోర్ట్స్ కార్నివాల్ లో పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. రాష్ట్రంలో ఎక్కువగా ఎగుమతి అయ్యే వస్తువులను ప్రదర్శనలో తిలకిస్తూ వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గడచిన రెండేళ్లలో పెనుసవాళ్లను ఎదుర్కొన్నామని.., ఆర్థిక మాంద్యం కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్య ఒక సంవత్సరంలో అయితే, రెండో సంవత్సరం కోవిడ్‌ విపత్తును చూశామన్నారు.

  దీనివల్ల దేశవ్యాప్తంగా రెవిన్యూ వసూళ్లు 3.38శాతం పడిపోయాయని సీఎం జగన్ తెలిపారు. 2018–19 మధ్యకాలంలో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో అవి రూ.20,10,059 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధిరేటు 2018–19లో 6.3 శాతం ఉంటే.. అది 2019–2020 నాటికి 4 శాతానికి పడిపోయిందని.. తదుపరి ఏడాది మరింతగా క్షీణించి, 2020–21 నాటికి – 7.3 (మైనస్‌) శాతానికి పడిపోయిందన్నారు. దేశం నుంచి ఎగుమతులు కూడా బాగా పడిపోయాయన్న సీఎం.. 330 బిలయన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు, 11.6 శాతంగా ఉన్న ఎగుమతులు... రెండేళ్ల కాలంలో 290 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయినట్లు తెలిపారు. దేశంలో ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయమని అభిప్రాయప్డడారు.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఉచిత దర్శన టోకెన్లపై టీటీడీ సంచలన నిర్ణయం...


  విపత్కర పరిస్ధితుల్లోనూ రాష్ట్ర ఎగుమతుల్లో వృద్ధి సాధించామని సీఎం జగన్ అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం నుంచి ఎగుమతులు 19.4శాతం వృద్ధి చెందాయన్నారు. 14.1 బిలియన్‌ డాలర్ల నుంచి 16.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయన్నారు. సముద్రపు ఉత్పత్తులు 15శాతం ఎగుమతులకు దోహదపడ్డాయన్న జగన్..., షిప్, బోట్ల నిర్మాణాల రూపేణా 8.5శాతం, ఫార్మారంగం 7.3 శాతం, ఐరన్‌ మరియు స్టీల్‌ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్‌ బాస్మతి రైస్‌ 4.8 శాతం ఎగుమతులకు దోహదపడ్డాయన్నారు. ఈ రంగాలన్నింటి వల్ల మొత్తంగా ఎగుమతులు 19.4శాతం పెరిగినట్లు వివరించారు.

  ఇది చదవండి: దేవుడి వరమంటే ఇదేనేమో..! బిడ్డలు దూరమైన రోజే కవలలు జననం..  ఎగుమతుల్లో 4వ స్ధానం

  2018–19లో ఎగుమతుల విషయంలో రాష్ట్రం 9వ స్థానంలో ఉండేది. 2019–20లో 7వ స్థానానికి, 2020–21లో 4వస్థానానికి చేరుకున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ కూడా కోవిడ్‌ సంవత్సరం 2020–21లో 2.58శాతం క్షీణిస్తే..., దేశ జీడీపీ 7.3శాతం క్షీణించిందన్నారు. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాలు ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతికి, ఎగుమతుల వృద్ధికి ఈరెండు చాలా కీలకమైనవని ఆయన వివరించారు. గడచిన రెండేళ్లలో పరిశ్రమలస్తాపనలో ముందుకెళ్లామని జగన్ అన్నారు. రూ.5,204 కోట్లతో 16,311 ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పడం జరిగిందని.., తద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇది కాకుండా గడచిన రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. రూ.30,175కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించిందన్నారు.

  ఇది చదవండి: టాలీవుడ్ అంశంపై ప్రభుత్వం ఫోకస్.. ముద్రగడ లేఖతో మరో ట్విస్ట్.. క్లైమాక్స్ ఎంటీ..?  రూ.36,384 కోట్లతో భారీ పరిశ్రమలు..

  ఇదే కాకుండా రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఈ పరిశ్రమలకు 76,960 మందికి ఉద్యోగాల కల్పించే సామర్థ్యం ఉందన్నారు. గడచిన ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు చేయనున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామన్నారు. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.  దేశంలో మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేని జగన్ వివరించారు. విశాఖపట్నం - చెన్నై, చెన్నై- బెంగుళూరు, హైదరాబాద్‌- బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయన్నారు. ఆర్థిక వృద్ధిరేటును పెంచడమే కాదు, పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయిన్నారు.

  ఇది చదవండి: చంద్రబాబు కంచుకోటకు బీటలు... కుప్పంలో జెండాపాతిన వైసీపీ...


  మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ – కొప్పర్తి

  రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్‌జిల్లాలో కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధిచేస్తోందని జగన్ తెలిపారు. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యుత్తు, నీళ్లు, ఎస్‌టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రూ.20వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నామని..., దాదాపు లక్షమందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉందన్నారు. ఇదే ఇండస్ట్రియల్‌ పార్కులో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. 800 ఎకరాల్లో రూ.1730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. తద్వారా 25వేలమందికి ఉద్యోగాల కల్పనా సామర్థ్యం ఈఎంసీకి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టీల్‌ ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ దృష్ట్యా 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కడప జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.13,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీ రాబోతోందన్నారు.

  ఇది చదవండి: ఏపీలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి..? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..?  రాష్ట్రంలో 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు

  నైపుణ్యలేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. తిరుపతిలలో ఒక స్కిల్‌ యూనివర్శిటీని, ఒక స్కిల్‌ యూనివర్శిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక యూనివర్శిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధిచేయడంపై దృష్టిపెడితో మరో యూనివర్శిటీ ఐటీరంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి దృష్టిపెడుతుందన్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విద్యార్థుల నైపుణ్యాలను ఈ కాలేజీలు మెరుగుపరుస్తాయని అభిప్రాయపడ్డారు.

  సమావేశానికి డిప్యూటీ సీఎం(రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mekapati Goutam Reddy, Peddireddy Ramachandra Reddy

  ఉత్తమ కథలు