Good News to Employees: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్సీసీ (PRC) విషయంలో.. బకాయిల చెల్లింపు.. సీపీఎస్ (CPS) రద్దు.. పని ఒత్తిడి.. ఆన్ లైన్ విధానం ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వం తీరును ఉద్యోగులు తప్పుడు పడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా.. వైసీపీ (YCP) కి ఓట్లు వేసి.. జగన్ సీఎం (CM Jagan) అయ్యేలా ప్రయత్నిస్తే.. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక మొన్న పీఆర్సీసీ వివాదంలోనే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటి అన్నది సర్కార్ అర్థమైంది. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగి.. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి వారిని పీఆర్సీ విషయంలో ఒప్పించడంలో ప్రభుత్వ పెద్దలకు సక్సెస్ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు (Employees Union Leaders) అయితే ప్రభుత్వం తీరును ప్రశంసించారు కానీ.. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. ఇక ఉపాధ్యాయులు అయితే ఇప్పటికే నిరసన బాట పడుతూనే ఉన్నారు. తాజాగా సీపీఎస్ రద్దు విషయంపై.. మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. తమకు జీపీఎస్ వద్దని.. సీపీఎస్ కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ మానస పుత్రిక అయినా సచివాలయం ఉద్యోగులు సైతం వ్యతిరేకంగానే ఉన్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేసే విషయంలో షరతులు పెట్టడం.. కాలయాపన చేయడంపై నిరసనలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వబోతోంది. విషయం ఏంటంటే..? ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇప్పటివరకూ నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్ పై సీఎం జగన్ సంతకం కూడా చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. దీంతో రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ సాగేందుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రెండు రోజుల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది ప్రభుత్వం. జూన్ 17 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి విషయాల్లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.
ఇదీ చదవండి : పవన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు.. ఆయన పోరాటం పొత్తుల కోసమే..
మరోవైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకున్న బదిలీల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని హామీలను జగన్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees