• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VIJAYAWADA ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WISHES TO EX MINSTER CHANDRA BABU NAIDU ON HIS BIRTHDAY NGS

Andhra Pradesh: భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్న జగన్. క్రమశిక్షణకు మారుపేరన్న చిరు

Andhra Pradesh: భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్న జగన్. క్రమశిక్షణకు మారుపేరన్న చిరు

చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సంతోషంగా.. నిండు ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని భగవంతున్ని కోరుతున్నా అంటూ ఏపీ సీఎం జగన్ విష్ చేశారు. కాసేపటికే ఆ ట్వీట్ ట్రెండింగ్ గా మారింది.

  • Share this:
    మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురుస్తోంది. చంద్రబాబు అంటే అంత ఎత్తున మండిపడే నేతలు సైతం ఆయన్ను పొగడ్తలతో ముంచెస్తున్నారు. తాజాగా సీఎం జగన్ కూడా భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఇలా ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబునాయుడుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

    అయితే కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండడమే తనకు ముఖ్యమన్నారు. కరోనాకు అంతా దూరంగా ఉండాలన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, చంద్రబాబు ఫ్యాన్స్ వరుస పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో #HBDCBN అనే హ్యాష్ ట్యాగ్ మోత మోగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలే ఎక్కవగా పోస్టులు పెడుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

    మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. హార్డ్ వర్క్, క్రమశిక్షణకు మారు పేరు అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

    రాజకీయాల్లో చంద్రబాబుది ప్రత్యేక గుర్తింపు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఏపీ నేత ఆయన. టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.

    తరువాత కాంగ్రెస్ చేరారు. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేవలం 28వ ఏళ్ల వయసులోనే మంత్రిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. టంగుటూరి అంజయ్య మంత్రిమండలిలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. తరువాత ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించినప్పటికి చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందగా… ఆ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు తరువాత టీడీపీలో చేరారు.

    1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొంది శాసన సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. తరువాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించడంతో పాటు 2004, 2009 పదేళ్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ఓటమిని చనిచూసింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది చంద్రబాబుకు ఏదీ కలిసిరావడం లేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలు తమ ఖాతాలో వేసుకుంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు