Jagan Warning: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) లో మరో ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలకు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaki Government) విషయంలో నేతల తీరు మారడం లేదని అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయనకు అందిన నివేదికల ప్రకారం.. కీలక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం డేంజర్ జోన్ లో ఉన్నట్టు సమాచారం. అందుకే వారంతా గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ స్వయంగా సూచించారు. అయినా చాలామంది తీరు మారడం లేదని తెలుస్తోంది.
గత డిసెంబరు 16న జరిగిన వర్క్ షాపు నాటికి 28 మంది ఎమ్మెల్యేలు వెనుకబాటు జాబితాలో ఉండేవారు. ఇప్పుడు తాజాగా జరిగిన వర్క్ షాపులో సైతం ఇంచుమించుగా అదే సంఖ్య కనిపిస్తుండడంతో జగన్ కాస్త అసహనానికి గురైనట్టు సమాచారం. ముఖ్యంగా ఆ జాబితాలో కీలక నేతలు ఉండేసరికి హైకామండ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
గత 50 రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులపై నిఘా పెట్టిన ఐప్యాక్ బృందం ఒక సర్వే నివేదికను రూపొందించినట్టు సమాచారం. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాపులో టీమ్ కు సారధ్యం వహిస్తున్న రుషిరాజ్ వెనుకబడిన ఎమ్మెల్యేల పేర్లను చదివి వినిపించారని తెలుస్తోంది.. దీంతో విన్నవారికి మైండ్ బ్లాక్ అయినట్టు టాక్..
ఇదీ చదవండి : అవినీతిని ప్రశ్నిస్తే మహిళల్ని కించపరిచినట్టా..? మళ్లీ రోజాపై లోకేష్ సెటైర్లు
అటు పార్టీ అధినేత కూడా కాస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారండి.. లేకుంటే మార్చేస్తానంటూ సుతిమెత్తని హెచ్చరికలు జారీచేశారని తెలుస్తోంది. అయితే గతంలో లా మరీ అంతా కఠువుగా తిట్టలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ తో జగన్ అచీతూచీ వ్యవహరించాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి : కాపుల చుట్టూ కమలం ప్రదక్షిణలు.. ఇటు ఎంపీ జీవీఎల్.. అటు వైపు కన్నా..? అసలు ప్లాన్ ఇదే
తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యుల పనితీరు బాగాలేదని రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ తేల్చేసింది. వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ , ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, కొడాలి నాని , చెన్నకేశవరెడ్డి, బొత్స అప్పలనరసయ్య, చింతల రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత , జొన్నలగడ్ల పద్మావతి, మద్దిశెట్టి వేణుగోపాల్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అన్నా రాంబాబు, కాటసాని రామిరెడ్డి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, జి.శ్రీనివాసులనాయుడు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి : బుగ్గన అందుకే అలా చెప్పారు.. ఏపీ రాజధానిపై తేల్చి చెప్పేసిన సజ్జల
అలాగే తాడికొండ నియోజకవర్గ ఇన్ చార్జి సురేష్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జి అడారి ఆనంద్, పర్చూరు ఇన్ చార్జి ఆమంచి కృష్ణమోహన్ లు వెనుకబడి ఉన్నట్టు ఐ ప్యాక్ బృందం తేల్చిచెప్పింది. అలాగే బాగా పనిచేసిన వారి జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో దూలం నాగేశ్వరరావు, వరుకూటి అశోక్ బాబు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp