హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్.. పూర్తి ప్రయోజనాలు ఇవే..

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్.. పూర్తి ప్రయోజనాలు ఇవే..

పేద, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్

పేద, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్

Good News: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఈ ఏడాది మార్చి నుంచి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ సేవలను విస్తరించాలని నిర్ణయించారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చూసేలా అధికారులకు సూచన చేశారు. ఆ వ్యాధులతో బాధపడేవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమ కార్యక్రమాల్లో మరింత దూకుడు పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పేద ప్రజలకు ఉపయోపడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) కాన్సెప్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్నట్టు చెప్పారు. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారం భించాల‌ని స్పష్టం చేశారు. అదేరోజు గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాల‌న్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించిన అధికారులు.

ఈ సందర్భంగా పూర్తి వివరాలు అందించారు అధికారులు.. ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని వివరణ ఇచ్చారు. ఒకవేళ జనాభా 4 వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పలు చోట్ల సత్ఫలితాలు ఇస్తున్నాయి.. పూర్తి స్థాయిలో అమలు చేస్తే.. పేద ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

అధికారులు చెప్పిన వివరాలు విన్న సీఎం.. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ లేదా జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.

ఇదీ చదవండి : యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవాలన్న సీఎం. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలమేరకు ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామన్న అధికారులు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే వైద్యారోగ్యశాఖ–స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి : అరచేతిలో ఇల వైకుంఠం.. టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం..? ఎన్ని ప్రయోజనాలంటే?

స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలని అధికారులను కోరారు. విలేజ్‌ క్లినిక్స్‌ ఎస్‌ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను సీఎం ఆదేశాల మేరకు చేర్చామన్న అధికారులు. విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, AP Politics, Ap welfare schemes

ఉత్తమ కథలు