Andhra Pradesh: కరోనా టైంలో విద్యార్థలకు గుడ్ న్యూస్. 11 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమ

కరోనా వేళ ఏపీలో విద్యార్థులకు శుభవార్త

కరోనా కష్ట కాలకంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. ఉన్నత చదువులు అందించడమే లక్ష్యంగా సీఎం జగన్.. విద్యార్థులకు మరో వరం అందిస్తున్నారు. 11 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

  • Share this:
    కరోనా కలకలంతో అంతా భయం భయంగా గడుపుతున్నారు. ఏపీలో విద్యా సంస్థలపై కరానో కాటు వేయడంతో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తరగతులు రద్దు చేశారు. కేవలం పది, ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇటు చదువు లేక.. అటు కరోనా భయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పండగ లాంటి వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం.

    ఉన్నత విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఉన్నత చదువులే పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి అంటూ తల్లిదండ్రులకు తాను ఇచ్చిన మాటను నేరవేర్చడం కోసం సీఎం జగన్ విద్యార్ధుల కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా బుధవారం ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒక్క కంప్యూటర్‌ క్లిక్ తో దాదాపు 11 లక్షలకుపైగా విద్యార్ధుల తల్లుల ఖాతాలో ఈ పథకం ద్వారా నగదు జమ చేయనున్నారు. ఈ పథకంతో తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకొనున్నారు.

    విద్యార్ధుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యా దీవెన పథకంతో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించి మొదటి త్రైమాసికానికిగాను 671.45 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లులకు ఏపీ ప్రభుత్వం అందించింది. ఇప్పుడు జగనన్న వసతి దీవెన పథకంతో విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం మరో 1,147.41 కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనుంది జగన్ సర్కార్.

    ఇదీ చదవండి: మూడు రోజుల్లో లాక్ డౌన్. ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు

    ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి 20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చులను జగన్‌ ప్రభుత్వం అందించనుంది. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా నగదు జమచేయనుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,220.99 కోట్లు చెల్లించింది. మొదటివిడతగా 1,147.41 కోట్లు బుధవారం రోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన పథకం కింద 2,368.40 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. ఇప్పటివరకూ జగన్‌ ప్రభుత్వం విద్యారంగంపై వివిధ పథకాల కింద సుమారు 25,812.60 కోట్లు ఖర్చు చేయగా, 1,60,75,373 మంది లబ్ధి పొందారు.

    ఇదీ చదవండి: వ్యాక్సిన్ పంపిణీ చేయలేం. కేంద్రానికి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం

    కరోనా కష్టసమయం అని ఏపీ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రస్తుతానికి పాఠశాలలు, పరీక్షలు అన్ని వాయిదా పడుతున్నా.. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
    Published by:Nagesh Paina
    First published: