Kesineni Nani పార్టీ మార్పుపై క్లారిటీ -అసలేం జరిగిందంటే -ఢిల్లీలో TDP ఎంపీ బిజీబిజీ

చంద్రబాబుతో కేశినేని నాని (ఫైల్)

Kesineni Nani : టీడపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని సైకిల్ దిగి బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారం విజయవాడలో కాకరేపుతున్నది. అసలేం జరిగిందనే దానిపై వివరణలు వెలువడుతున్నాయి. కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు, నాని పార్టీ మార్పుపై టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు..

  • Share this:
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని (TDP MP Kesineni Nani) బీజేపీలో చేరబోతున్నారన్న వార్త తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. కేశినేనితోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం హోరెత్తిపోతున్నది. కేశినేని భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)  ఫొటో తొలగించిన తర్వాత ఇది పతాక స్థాయికి చేరింది. అయితే, అసలు ఏం జరిగింది, బాబు ఫొటోను తొలగించడానికి వెనకున్న కారణాలను టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కానీ పార్టీగానీ, ఎంపీగానీ ఇప్పటిదాకా నేరుగా స్పందిచలేదు..

అసలేం జరిగిందంటే..
టీడీపీ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారనే వార్తలపై విజయవాడ టీడీపీ నేత ఫతావుల్లా క్లారిటీ ఇచ్చారు. సిటీలోని కేశినేని భవన్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫొటో తొలగింపు వెనుక అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు. కేశినేని భవన్ లో ఒక ఛాంబర్ లో మాత్రమే చంద్రబాబు ఫొటోను మర్చారని, ఆఫీసు బయట, లోపల మిగతా గదుల్లోనూ చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలు యథావిథిగా ఉన్నాయని ఫతావుల్లా చెప్పారు. కేశినేని భవన్ చుట్టూ, లోపల చంద్రబాబు, ఇతర నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు..

Chandrababuకు భారీ షాక్ -ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ గుడ్ బై! -BJPలో TDP పీపీ విలీనం!


అందుకే ఫొటో మార్పు..
కేశినేని ఆఫీసులో చంద్రబాబుతో కలిసున్న ఫొటోను తొలగించి, ఆ స్థానంలో రతన్ టాటాతో నాని కలిసున్న ఫొటోను పెట్టారు. కాగా, టాటా ట్రస్ట్ సేవల గుర్తింపుగానే లోపల ఒక ఫోటోను పెట్టామని, రతన్ టాటా ట్రస్ట్‌ ద్వారా సేవలు మరింత విస్తృతం కావాలన్న ఉద్దేశంతోనే ఫొటోలు మార్చారు తప్ప ఇందులో పార్టీ మార్పు కోణం లేదని ఫతావుల్లా క్లారిటీ ఇచ్చారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడైన ఎంపీ కేశినేని నాని ఆయా మీటిగ్స్ లో పాల్గొంటూ ఢిల్లీలో బిజీగా ఉన్నారని, అంతమాత్రాన బీజేపీలో చేరడానికే ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు రయడం తగదని టీడీపీ నేత అన్నారు.

Manchu Vishnu సంచలన వ్యాఖ్యలు -Pawan Kalyan ఫ్యాన్స్ కోసమే అలా చేశా -Prakash rajకు సవాల్ -బైలాస్ మార్చేస్తాం..


మునిగే నావలోకి దూకుతారా?
బీజేపీని మునిగిపోయే నావగా పోల్చిన టీడీపీ నేత ఫతావుల్లా.. కేశినేని నానీ పార్టీ మార్పుపై జరుగుతోన్నదంతా అసత్య ప్రచారమని, చంద్రబాబుతో నానికి విభేదాలన్న మాట అవాస్తవమని ఫతావుల్లా పేర్కొన్నారు. ‘అసలు మునిగిపోయే పడవలోకి ఎవరైనా వెళతారా?’అని ప్రశ్నించారు. కాగా, కేశినేని పార్టీ మార్పుపై నిన్నటి నుంచీ ప్రచారం జరుగుతున్నా టీడీపీ ముఖ్య నేతలుగానీ, పార్టీగానీ ఇప్పటిదకా స్పందించలేదు. బుచ్చయ్య చౌదరిని బుజ్జగించినట్లే కేశినేనిని నానిని కూడా చంద్రబాబు సెట్ చేస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..
Published by:Madhu Kota
First published: