Vijayawada Land Scam: బెజవాడలో మరో ల్యాండ్ స్కామ్... మంత్రిపై ఆరోపణలు.. తెరవెనుక కథ నడిపిన ఓఎస్డీ..?

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫైల్)

Land Scam: అధికారం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది రాజకీయ నాయకుల పాలసీ.. కానీ ఏపీలోని ఓ మంత్రి (AP Minister) మాత్రం నాలుగేంటి.. నలభై రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దందా సాగించడం చర్చనీయాంశమైంది.

 • Share this:
  Anna Raghu, Guntur, News18

  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకోవాలనేది సామాన్యుల మాట... అధికారం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది రాజకీయ నాయకుల పాలసీ.. కానీ ఏపీలోని ఓ మంత్రి మాత్రం నాలుగేంటి.. నలభై రాళ్లు వెనకేసుకోవాలనే చందంగా దందా సాగించడం చర్చనీయాంశమైంది. విజయవాడ (Vijayawada) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అప్రకటిత ఆర్ధిక రాజధాని. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. అటువంటి విజయవాడలో అదీ నగరం నడి బొడ్డున ఉన్న స్థలం అంటే గజం తక్కువలో తక్కువ లక్షరూపాయలైనా ఉంటుంది. అందుకే నగరంలో ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక అధికారంలో ఉన్నవారి దందా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాల్లో ఉన్న భూ వ్యవహారాల్లో తలదూర్చడం వాటిని తక్కువ ధరకు దక్కించునేందుకు స్కెచ్ వేయడం సర్వసాధారణమైపోయింది. నగరానికి చెందిన ఓ మంత్రిగారి వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇందులో అధికారులతో పాటు పోలీసులు కూడా తలదూర్చడం సంచలనంగా మారింది.

  వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో సుమారు రూ.8 కోట్ల విలువ చేసే 738 గజాల స్థలాన్ని అప్పనంగా కొట్టేయడానికి ఓ మంత్రి ఆయన ఓఎస్డీ కలిసి వేసిన స్కెచ్ బయటకు పొక్కడంతో సి.యం ఓ నుండి సదరు మంత్రికి అక్షింతలు, ఓఎస్డీని మాతృశాఖకు సరెండర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మధ్యలో ఓ ఉద్యోగిపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

  ఇది చదవండి: చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్


  ఎన్.ఓ.సీతో మొదలైన దందా..!
  విజయవాడ రూరల్ మండలం పరిధిలోని జక్కంపూడి పంచాయితీ పరిధిలో ఈది అప్పలస్వామి సత్రానికి చెందిన 5 ఎకరాల వ్యవసాయ భూమి దేవాదాయ దర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఐతే ఆ భూమిలో 2.5 ఎకరాలు తమకు పూర్వార్జితంగా వచ్చిందని, ఆ భూమిపై తమ హక్కులు కల్పిస్తూ తమ పేరున నిరభ్యంతర పత్రం ఇవ్వాలంటూ సత్రం దాతలు అయినటువంటి భోగవల్లి కుటుంబ వారసులు గతంలో అర్జీ పెట్టుకున్నారు. విషయం తెలిసిన దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డీ సదరు భూమికి N.O.C కావాలంటే ఆ కుటుంబానికే చెందిన వేరొక భవనం తన మిత్రునికి తక్కువధరకే అమ్మాలంటూ ఒప్పందం చేసుకున్నారు.

  ఇది చదవండి: టీటీడీలో ముదురుతున్న జీడిపప్పు వివాదం.. వారి సహకారం లేకుండానే జరిగిందా..?


  సదరు భవనం ఉన్న 738 గజాల స్థలం విజయవాడ ఏలూరు రోడ్డులోని అప్సర థియేటర్ కు దగ్గరలో ఉంటుంది. ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్ లో 8 కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. అంతటి విలువైన స్థలాన్ని కేవలం 10 లక్షల రూపాయలకు మంత్రి గారి ఓ.ఎస్డి తన స్నేహితుడి పేరు మీద అగ్రిమెంట్ రాపించాడనేది ఆరోపణ. అంతేకాదు ఎన్.ఓ.సీ రాని స్థలాన్ని కూడా తక్కువ ధరకు విక్రయించేందుకు అగ్రిమెంట్ కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: వైసీపీలో ఇద్దరి యువనాయకుల మధ్య ఆధిపత్య పోరు... జగన్ కు తలనొప్పిగా మారిన వ్యవహారం


  జక్కంపూడి లోని స్థలానికి N.O.C వచ్చాక ఏలూరు రోడ్డులోని భవనాన్ని మంత్రి గారి ఓఎస్డి స్నేహితుని పేరు మీద రిజిష్టర్ చేసేలా మొదట ఒప్పందం కుదిరింది. ఐతే N.O.C రాకమునుపే స్థలం రిజిష్టర్ చేయాలంటూ పోలీసుల ద్వారా స్థలం యజమానులపై ఒత్తిడి తీసుకురావడంతో విషయం బయటికి పొక్కింది.  మంత్రి గారి క్విడ్ ప్రో కో బెడిసి కొట్టడం, విజయవాడ 1టౌన్ పోలీసుల సెటిల్మెంట్ల భాగోతం వెలుగులోకి రావడం అధికారపార్టీని కలవరానికి గురిచేస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ భుముల వ్యవహారంలో సదరు మంత్రి గారి తీరు కంచే చేను మేసినట్లుందని, దేవుడి భూములకు ఆ దేవుడే దిక్కని ప్రజలు అంటున్నారు.

  ఈ భూ వివాదంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన ఓఎస్డీ హస్తముందని జనసేన నేప పోతిన వెంకటమహేష్ ఆరోపించారు. సీక్రెట్ గా సాగుతున్న వ్యవహారంలో పోలీసులు తలదూర్చడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో అసలుదోషులను తప్పించేందుకు గతంలో మంత్రివద్ద పనిచేసిన పీఆర్వో శ్రీనివాస్ ను ఇరికించారని పోతిన మహేష్ ఆరోపించారు.
  Published by:Purna Chandra
  First published: