హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Navaratri 2022: ఏపీలో మొదలైన నవరాత్రి శోభ.. అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల నుంచి సారె.. చూస్తే వావ్ అంటారు

Navaratri 2022: ఏపీలో మొదలైన నవరాత్రి శోభ.. అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల నుంచి సారె.. చూస్తే వావ్ అంటారు

మొదలైన నవరాత్రి శోభ

మొదలైన నవరాత్రి శోభ

Navaratri 2022: ఆంధ్రప్రదేశ్ లో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లో ముందు నుంచే నవరాత్రి శోభ కనిపిస్తోంది. అమ్మవారికి తొలిసారిగా అష్టాదశ శక్తి పీఠాల నుంచి సారె తీసుకొచ్చారు. దీంతో కన్నుల పండుగగా శోభాయాత్ర కొనసాగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Navaratri 2022: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ఆలయాల్లో దసరా వేడుకలను (Dussehra Celebration) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26వ తేదీ నుంచి తొమ్మి రోజుల పాటు ప్రత్యేక అలంకారాలతో పాటు.. ప్రత్యేక పూజలు అందుకునేందుకు అమ్మవారు సిద్ధమవుతున్నారు. ఈ నవరాత్రుల సమయాల్లో ప్రముఖ దేవాలయాలన్నీ రద్దీగా మారనున్నాయి. మరోవైపు నెల్లూరు (Nellore) లో దేవీన్నవరాత్రి ఉత్సవాల సందడి అప్పుడు కనువిందు చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అష్టాదశశక్తి పీఠాల నుంచి నెల్లూరు నవరాత్రి ఉత్సవాల కోసం సారెను తెప్పించారు. ఆ సారెను చూసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు.

  దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి (Kotam Reddy) ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల కోసం అష్టాదశ శక్తిపీఠాల నుంచి చీరలు, అక్షింతలు, కుంకుమ, అభిషేక జలాలు, ప్రత్యేక సారెను తెప్పించారు. ఉత్సవాలకు మూడు రోజుల ముందుగానే అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు.

  దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వరకు ఈ శోభాయాత్ర నిర్వహించారు. టీటీడీ వాద్య, నాట్య బృందాల నీరాజనంతో మూడు పల్లకీల్లో అమ్మవారిని ఊరేగించారు. ఈ శోభా యాత్రలో అష్టాదశ శక్తిపీఠాల సారెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక అదిశంకరాచార్యుల వారి ఊరేగింపు కనులవిందుగా సాగింది. అమ్మవారి నామస్మరణలతో సింహపురి మార్మోగింది.

  ఇదీ చదవండి : అమరావతి రైతులకు వార్నింగ్.. మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం.. గుడివాడలో ఫ్లెక్సీల కలకలం

  మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దర్శించుకునేందుకు ఈసారి భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయకమిటీ భేటీ తర్వాత దుర్గగుడి ఈవో భ్రమరాంబ వివరాలు వెల్లడించారు. దసరాలో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. కోఆర్డినేషన్ కమిటి మీటింగ్ లో అన్ని సూచనలు పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామన్నారు. చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు.  

  ఇంద్రకీలాద్రిపై లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. 21 లక్షల ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు. అలాగే ఈసారి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత , 100 రూపాయలు, 300 రూపాయల క్యూ లైన్స్ తో పాటు వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులు ఎక్కడా ఆగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.

  ఇదీ చదవండి : టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం..! కారణం అదేనా?

  గతంలో 300 షవర్స్ ఏర్పాటు చేస్తే ఈసారి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. ఈ ఏడాది అన్నదానం నిర్వహించడంలేదని, భక్తులకు భోజన ప్యాకెట్స్ అందజేస్తున్నామన్నారు. అలాగే అంతరాలయం దర్శనం కూడా లేదన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Nellore

  ఉత్తమ కథలు