హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్..

Dussehra 2022: నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్..

నేడు విజయవాడకు సీఎం జగన్

నేడు విజయవాడకు సీఎం జగన్

Dussehra 2022: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ చాలా ముఖ్యమైన రోజు.. అమ్మవారి జన్మ నక్షత్రం మూల కావడంతో.. అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనం ఇస్తున్నారు. మరోవైపు ఇవాళ సీఎం జగన్ అమ్మవారికి వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా సాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పుణ్యక్షేత్రం.. విజయవాడ (Vijayawada) లో వెలసిన ఇంద్రకీలాద్రి (Indhra Keeladhri) పై కొలువుదీరిన కనక దుర్గమ్మ (Kanaka Durgamma). ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అందులోనూ ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు చాలా ముఖ్యమైన మూలా నక్షత్రం.. అంటే చదువుల తల్లి సరస్వతి దేవి , అమ్మలగమ్మ కనక దుర్గమ్మ జన్మ నక్షత్రం.. అందుకే ఈ రోజుని ఎంతో విశేషమైందిగా భావిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఇంద్రకీలాద్రి కి వెళ్లనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy). నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం.. చదువుల తల్లి సరస్వతి దేవి, అమ్మలగమ్మ కనక దుర్గమ్మ జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. అందుకే ఈ రోజుని ఎంతో విశేషమైందిగా భావిస్తారు.

  ఇవాళ అమ్మవారు సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు.

  ఇటు మూలా నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో..  ఈ  రోజున లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఓ వైపు భారీగా భక్తులు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు సీఎం జగన్ విజయవాడ వస్తున్నారు. దీంతో భద్రతపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.  

  ఇదీ చదవండి : ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడవాహనంపై శ్రీవారు.. విశిష్టతలు ఇవే

  శనివారం రాత్రి 11 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ రోజు అర్థరాత్రి వరకు ఆంక్షలు అమలవుతాయి.   గద్దబొమ్మ, కే.ఆర్. మార్కెట్, కనకదుర్గా ఫ్లైఒవర్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళు సిటీ, ఆర్.టి.సి బస్సులను పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుండి - పి.సి.ఆర్-  చల్లపల్లి బంగ్లా - ఏలూరు లాకులు - బి.ఆర్.టి.ఎస్ రోడ్ -  బుడమేరు వంతెన -  పైపుల రోడ్ -  వై.వి.రావు ఎస్టేట్ -  సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ -  సితారా - గొల్లపూడి వై జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపుకు పంపడం జరుగుతుంది.

  ఇదీ చదవండి: అమ్మకు ప్రేమతో.. ఆమె కోరికపై మోడల్ గా మారిన మిడిల్ క్లాస్ యువతి.. సక్సెస్ స్టోరీ ఇదే

  పి.యన్.బి.యస్ సిటి బస్ స్టాండ్ నుండి లో బ్రిడ్జి వైపుకు ఆర్.టి.సి.బస్సులకు అనుమతించ బడవు. ప్రకాశం బ్యారేజి మీదుగా తాడేపల్లి, మంగళగిరి వైపు వెళ్ళు వాహనములు కనక దుర్గమ్మ వారధి మీదుగా వెళ్ళవలయును. భవానిపురం వైపు నుండి నగరంలోకి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనములు కుమ్మరిపాలెం -సితారా - కబెళా- సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ - మిల్క్ ప్రాజెక్ట్ - చిట్టినగర్ - వి.జి.చౌక్ - పంజా సెంటర్ - పండిట్ నెహ్రు రోడ్ - లో బ్రిడ్జి ద్వార నగరములోనికి పంపడం జరుగుతుంది.

  ఇదీ చదవండి : ఇంట్లో ఉంటూనే ఆదాయం.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

  తాడేపల్లి వైపు నుండి ప్రకాశం బ్యారేజి మీదకు.. సీతమ్మవారిపాదాల వైపు నుండి ప్రకాశం బ్యారేజి-పి.ఎస్.ఆర్ విగ్రహం - ఘాట్ రోడ్ - కుమ్మరిపాలెం వరకు  కనక దుర్గా ఫ్లైఒవర్ మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించరు.  హైదరాబాద్ నుండి విశాఖపట్నం , విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపునకు వెళ్లే రవాణా  వాహానముల రాకపోకల మళ్లిస్తున్నారు.  ఇబ్రహీంపట్నం దగ్గర నుండి  జి కొండూరు – మైలవరం-  నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్ళిస్తున్నారు. 

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Dussehra 2022, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు