విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 4 సర్వీసులు ప్రారంభం

తిరుపతికి ఎక్కువ సీట్లు ఉన్న విమానం రావటంతో సీట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని... గతంలో కంటే తక్కువ ఛార్జీతోనే ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 27, 2019, 11:46 AM IST
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 4 సర్వీసులు ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో 4 విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారి రెండు నగరాల మధ్య విమానం నడవబోతోంది. విజయవాడ - తిరుపతి మధ్య 180 సీట్లు కలిగిన ఎయిర్​బస్​ నడవనుంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ఇప్పటివరకు తక్కువ సీట్లు అందుబాటులో ఉండేవి. దీంతో ఆ డిమాండ్‌ను బట్టి టికెట్ ధర పెరిగేది. తిరుపతికి ఎక్కువ సీట్లు ఉన్న విమానం రావటంతో సీట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని... గతంలో కంటే తక్కువ ఛార్జీతోనే ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రానుండగా... విశాఖపట్నం - విజయవాడ మధ్య స్పైస్ జెట్ సంస్థ సర్వీసును పునరుద్ధరిస్తోంది.

ఇవి కూడా చూడండి:

విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో పోలీసుల స్పెషల్ డ్రైవ్
Published by: Sulthana Begum Shaik
First published: October 27, 2019, 11:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading