Rahul Murder Case : రాహుల్ ను అందుకే చంపాం... నోరు విప్పిన కోరాడ విజయ్..

రాహుల్, కోగంటి సత్యం, కోరాడ విజయ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన విజయవాడ (Vijayawada) పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో (Rahul Murder Case) దర్యాప్తు పూర్తైంది. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10 రోజుల కస్టడీ కోరారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన విజయవాడ (Vijayawada) పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో (Rahul Murder Case) దర్యాప్తు పూర్తైంది. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10 రోజుల కస్టడీ కోరారు. ఈ నేపథ్యంలో హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ (Korada Vijay Kumar) దీనిపై నోరువిప్పాడు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా విజయ్ ను ప్రశ్నించగా.. “ మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు.. డబ్బు విషయంలో రేపు మాపు అని తిప్పించుకోవడంతో ఇలా చేశాం..” అని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కోగంటి సత్యంను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కస్టడీలో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ధిక వివాదాలే హత్యకు కారణంగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. మొత్తం 22 మంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు రాహుల్ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందింతులను అదుపులోకి తీసుకున్నారు.

  గాయత్రి అనే మహిళకు రాహుల్ రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉంది. క్రమంలో ఈనెల 18న రాత్రి 7.30 నిముషాలకు గాయత్రికి ఫోన్ చేసిన రాహుల్ డబ్బు విషయం మాట్లాడేందుకు కారులో ఒక్కడే వెళ్లాడు. రాహుల్ వస్తున్న విషయాన్ని గాయత్రి.. కోరాడ విజయ్ కుమార్ (Korada Vijay Kumar)కు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే డివి మ్యానర్ ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి విజయ్ కుమార్ కు చెందిన చిట్స్ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. అక్కడ డబ్బు విషయంలో మాట్లాడుకున్న అనంతరం.. కోగంటి సత్యానికి (Koganti Satyam) చెందిన దుర్గా కళామందిర్ కి రాహుల్ ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: కాసేపట్లో కుమార్తె పెళ్లి.. తల్లిదండ్రుల ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!  అక్కడ రాహుల్ పై దాడి చేసి పలు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నట్లు సమాచారం. అనంతరం రాహుల్, కోరాడ విజయ్ అతని అనుచరులు బాబూరావు, సీతయ్య, మరో ముగ్గురు కారులో మర్డర్ స్పాట్ కు వెళ్లారు. ఈ క్రమంలో రాహుల్ తో కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం రాహుల్ ముఖంపై దిండుతో అదిమిపెట్టి, తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాహుల్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. మొత్తం 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించినట్లు సమాచారం.

  ఇది చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ స్కామ్.. డిపాజిట్లు గల్లంతు...


  సత్యం స్కెచ్..
  రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ ను ఎలా హతమార్చాలి. ఎవరిని రంగంలోకి దించాలి. హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి.. పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: పెళ్లికూతురు, పెళ్లి కొడుకు రెడీ.. మండపం కూడా రెడీ.. ఇంతలో అమ్మాయి ఫోన్ మోగింది.. పెళ్లి ఆగింది..


  రాహుల్ హత్య తర్వాత కోగంటి పేరు బయటకు రావడంతో అతన్ని మీడియా సంప్రదించింది. ఐతే హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో అనవసరంగా తనపేరు బయటకు తెచ్చారని సత్యం బుకాయించారు. కానీ అతడే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఐతే పోలీసులు తనకోసం వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కోగంటి సత్యం.. విజయవాడ నుంచి విమానంలో బెంగళూరు (Bengaluru) వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని భావించాడు. ఐతే కోగంటి ప్లాన్ ముందుగానే పసిగట్టిన పోలీసులు బెంగళూరులు పోలీసులకు సమాచారమిచ్చి అతడ్ని పట్టుకున్నారు. అనంతరం విజయవాడ తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు.
  Published by:Purna Chandra
  First published: