రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ : విజయవాడ
అతివేగం ప్రమాదకరమని వేగంగా నడపడం వలన మనకి గాని ఎదుటి వారికి గాని ప్రాణ నష్టం జరుగుతుందని ఎంత చెబుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది. రోడ్లపై అంతే వేగంగా వెళ్తున్నారు. ఊళ్ళో పెద్ద పెద్ద వాహనాలు నడుపుతూ కూడా వేగంగా దూసుకెళ్తున్నారు. పైగాచిన్న వీధుల్లో సైతం వేగంగా నడుపుతున్నటువంటి పరిస్థితి.వీధుల్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ వుంటారు లేదా పెద్ద వయసు వారు లేక నోరు లేని మూమీ దృష్టిగ జీవాలు తిరుగుంటాయి ఇవేలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతు ప్రాణాలు బలి తీసుకుని కుటుంబxలో విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.
గుడివాడలోని 12వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ నేతకు చెందిన ట్రాక్టర్ ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు.మంచినీటి ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ళ చిన్నారి మృతితో గుడివాడలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
సదరు వాహనం స్థానిక వైసీపి నేతకు చెందినది కావడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ యస్.ఐ పి.నాగరాజు తెలిపారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివిధ ప్రకారం స్ధానిక 12 వ వార్డు యానాది కాలనికి చెందిన షైక్.కాలేషా,ఖతిజాల కుమారుడు అమీర్(3) పిల్లలతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అతి వేగంగా ట్రాక్టర్ బాలుడిని ఢీ కొట్టింది.
ఇలా జరగడంతో బాబుతో ఆడుకుంటున్న తోటి పిల్లలు ప్రమాదం జరగటంతోకేకలు వేశారు. దానితో ఇంటిలో పని చేసుకుంటున్న తల్లి బయటకు వచ్చి జరిగింది చూసి షాక్ కి గురి అయ్యింది. రక్తపు మడుగులో ఉన్న తమ బిడ్డను హుటాహుటిన స్థానిక ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్.ఐ పి. నాగరాజు తెలిపారు.
స్థానిక వైసీపి నేత సొంత ట్రాక్టర్ పై పురపాలక సంఘం అని పేరు రాపించి సీఎంజగన్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఫోటోలుతో పట్టణంలో అడ్డగోలుగా తిప్పుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనాలు ఎక్కువ ఉండే చోట మంచినీటి ట్యాంకర్లు డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టు తిప్పడంతో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పురపాలక సంఘానికి చెందిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు ప్రజలు. అధికారులనిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Local News, Vijayawada