ఇంట్లో పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రులు.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడుకుంటున్నా.. సరే.. ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకూ ఏమీ తెలియదు. ఏం తినాలో ఏం తినకూడదో.. ఏం చేయాలో చేయకూడదో... వారికి తెలియదు. ఆ వయసు అలాంటిది. అందుకే తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా... అది వారి ప్రాణాల మీదకే తెస్తుంది. విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేడి నీటి బకెట్‌లో పడి.. ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందింది.
పాపకు స్నానం చేయించేందుకు ఆమె తల్లి.. బకెట్‌లో నీళ్లు పోసి.. ఎలక్ట్రిక్ హీటర్ పెట్టి.. వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి మంచంపై ఆడుకుంటోంది. ఐతే తల్లి బాత్‌రూమ్‌కి వెళ్లిన తర్వాత... ఆ చిన్నారి మంచంపై ఆడుకుంటూ అలాగే ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మంచం పక్కనే బకెట్ ఉండటంతో... ఆడుకుంటూ వెళ్లి ఆ పాప బకెట్‌లో పడింది. అప్పటికే నీళ్లు బాగా వేడెక్కడంతో.. ఆ వేడికి పాప తల్లిడిల్లిపోయింది. గట్టిగా ఏడవడంతో... తల్లి బాత్‌రూమ్‌ను పరుగెత్తుకొచ్చి... తన కూతురిని బకెట్ నుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే పాప శరీరం మొత్తం కాలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. పాప మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చిన్నపాటి నిర్లక్ష్యం... ఆ పాప నిండు ప్రాణాలను తీసింది. కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అందుకే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు... వారి పట్ల ఎంతో కేరింగ్ తీసుకోవాలి. అనుక్షణం వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ.. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada