K Pawan Kumar, News18, Vijayawada
రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలు లక్ష్యంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. వార్తల్లో, పేపర్లలో ఎన్ని చూసినా ప్రజలు మారడం లేదు. ముక్కు మొహం తెలియదు. ఎక్కడుంటారో తెలీదు వారి వివరాలు తెలియదు. కానీ ఆపదలో ఆదుకునే ఇంటి సభ్యుడిలా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి తాకట్టులు లేకుండా అడిగినంత లోన్స్ ఇస్తామంటూ టోకరా వేస్తు్న్నారు. ఇప్పుడీ కేటుగాళ్లు కొత్తదారిలో వెళ్తు్న్నారు. జనసేన పార్టీ పేరుతో చీటింగ్ పనులు చేస్తున్నారు. జనసేన (Janasena) పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ దందా చేస్తున్నారంటే వారి ధైర్యం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. జనసేన తరపు నుంచి లోన్స్ ఇస్తున్నారంటూ అమాయకులను చీట్ చేస్తున్నారు.
జనసేన పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ముఠా.. లోన్ల పేరుతో చీట్ చేస్తోంది. రాఘవేంద్ర అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్ గా ఉంటూ.. మరో ఐదుగురికి లోన్స్ ఇచ్చి ఆదుకున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు. అతడ్ని పొడుగుతూ మిగిలిన ఐదుగురు మెసేజ్ లు చేయడంతో మిగిలిన గ్రూప్ సభ్యులంతా నమ్మేశారు.
మీకు ఎంత లోన్ కావాలన్నా ఇస్తామని.. ముందుగా పాన్ కార్డు పంపితే ఈఎంఓ పెండింగ్ చెక్ చేస్తామంటున్నారు. లోన్ కావాలంటే రూ.3800 చెల్లించాలని.. పాన్, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే గంటలో డబ్బులిస్తామంటూ జనాన్ని మోసం చేస్తున్నారు. నిండా మునిగేవరకు జనం గుర్తించలేకపోతున్నారు.
ఇలా ఓ బాధితురాలికి బుట్టలో వేసుకున్న ముఠా.. ఆమె దగ్గర్నుంచి పాన్, ఆధార్ సహా అన్ని వివరాలు తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.3,800 ఇవ్వాలన్నారు. ఆమె గంటలో ఇస్తామని చెప్పగా.. 15 నిముషాల్లో డబ్బులివ్వకుంటే లోన్ రిజెక్ట్ అవుతుందని బెదిరించారు. అనుమానం వచ్చిన సదరు మహిళ.. వెంటనే న్యూస్18ని సంప్రదించింది.
ఐతే వీళ్ల దందాకు జనసేన పార్టీ ట్యాగ్ తగిలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు నిజంగా ఆ పార్టీకి చెందిన వారా.. లేక జనసేనను దెబ్బకొట్టేందుకు ఏమైనా కుట్ర చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీరు ఇంకా ఎంతమందిని మోసం చేశారు.. ఎంత డబ్బులు వసూలు చేశారనేది కూడా బయటకు రావలసి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada