హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Krishna District: 15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ జంప్.. మిస్సింగ్ వెనుక మిస్టరీ అదేనా..?

Krishna District: 15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ జంప్.. మిస్సింగ్ వెనుక మిస్టరీ అదేనా..?

స్వప్న (ఫైల్)

స్వప్న (ఫైల్)

Gudivada: ఎదురింటి కుర్రాడితో చనువుగా ఉంటున్న ఓ మహిళ.. ఏకంగా అతడ్ని తీసుకొని వెళ్లిపోయింది. ఆమె.. ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసిందా లేక ఇద్దరి మధ్య ఏదైనా వ్యవహారం నడుస్తోందా అనే దానిపై పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఒక్కోసారి కొన్నికొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్ని బంధాలు విన్నప్పుడు నోట మాట రాదు. వయసుతో సంబంధం లేకుండా జరిగే వ్యవహారాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఎదురింటి కుర్రాడితో చనువుగా ఉంటున్న ఓ మహిళ.. ఏకంగా అతడ్ని తీసుకొని వెళ్లిపోయింది. ఆమె.. ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసిందా లేక ఇద్దరి మధ్య ఏదైనా వ్యవహారం నడుస్తోందా అనే దానిపై పోలీసులు తలలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లో పెళ్లై ఇద్దరు పిల్లలున్న మహిళ, 15 ఏళ్ల బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయింది. గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటకు చెందిన స్వప్న అనే మహిళకు పెళ్లయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

కొంతకాలంగా తమ ఎదురింట్లో ఉండే ఎనిమిదవ తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలుడితో స్వప్న చనువుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 19న అతడ్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తొలుత ఆమె బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు భావించారు. ఎదురింట్లో బాలుడు కూడా కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే బాలుడ్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేసిందా.. లేక ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందా అనేది మాత్రం తెలియలేదు.

ఇది చదవండి: ఆన్ లైన్లో ఫ్రెండ్ షిప్.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్..


తమ కుమారుడు కనిపించకపోవడంపై బాలుడి తండ్రి గుడివాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వప్న బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు టూ టౌన్ సీఐ దుర్గారావు తెలిపారు. ఐతే ఇంతవరకు వారి దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వాళ్లిద్దరి కోసం గాలిస్తన్నారు. స్వప్న ఫోన్ కాల్ డేటా, సిగ్నల్ ఆధారంగానూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే స్వప్నతో పాటు బాలుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..


ఐతే 15 ఏళ్ల బాలుడ్ని 28 ఏళ్ల మహిళ తీసుకొని వెళ్లిపోయిందన్న వార్తలు జిల్లాలో హల్ చల్ చేస్తున్నాయి. బాలుడ్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేసుంటే ఇప్పటికే కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ వచ్చి ఉండేవి. ఇంతవరకు అలాంటిదేదీ లేకపోవడంతో మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. మరి ఈ వ్యవహారంలో చివరికి ఏం తేలుతుందో వేచి చూడాలి. గతంలోనూ తమ కంటే వయసులో చిన్నవాళ్లను తీసుకొని మహిళలు వెళ్లిపోయిన ఘటనలు వెలుగుచూశాయి.

First published:

Tags: Andhra Pradesh, Gudivada, Krishna District

ఉత్తమ కథలు