VIJAYAWADA 1998 DSC CANDIDATES SAW THEIR BRIGHTER SIDE OF LIFE AFTER 25 YEARS LONG WAIT HERE ARE SOME INTERESTING STORIES FROM VIJAYAWADA FULL DETAILS HERE PRN VPR NJ
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ-1998 అభ్యర్థులు
Vijayawada: దాదాపు పాతికేళ్ల పోరాటం తర్వాత వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఎన్నో కలలు, మరెన్నో ఊహల మధ్య పరీక్ష పాసై.. ఉద్యోగం సంపాదించినా అనుకోని అవాంతంర.. ఆ సువర్ణావకాశాన్ని దూరం చేసింది. న్యాయం కోసం పోరాడుతూనే పాతికేళ్లు గడిచాయి.
దాదాపు పాతికేళ్ల పోరాటం తర్వాత వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఎన్నో కలలు, మరెన్నో ఊహల మధ్య పరీక్ష పాసై.. ఉద్యోగం సంపాదించినా అనుకోని అవాంతంర.. ఆ సువర్ణావకాశాన్ని దూరం చేసింది. న్యాయం కోసం పోరాడుతూనే పాతికేళ్లు గడిచాయి. ఎట్టకేలకు ఎప్పుడో రాసిన పరీక్షకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఆ అంశమే 1998 డీఎస్సీ (1998 Dsc). ఎందరి కలల్లో రెండున్నర దశాబ్దాల తర్వాత నిజం చేసింది న్యాయస్థానం. వారిలో అందులో ఒకరే మల్లీశ్వరీ. 1998 డీఎస్సీ లో క్వాలిఫై అయినప్పటి నుంచి ఉద్యోగం వస్తుంది అని కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తూన్న వారిలో ఈవిడ ఒకరు. 2006లో విద్య వాలంటీర్‌గా అవకాశం వచ్చిందని సంబరడితే వెయ్యి రూపాయల జీతం కోసం ప్రతి రోజూ 15 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వచ్చేదని మల్లీశ్వరీ తెలిపారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా తరంగ మారింది.
నాలుగు ఏళ్ళు గడిచాక రూ.5,000 జీతానికి మున్సిపల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో క్లస్టర్ రిసోర్సెస్ పర్సన్‌గా అవకాశం రావడంతో కుటుంబ పోషణ కాస్త మెరుగు పడింది. ఇలా ఒక్క మల్లేశ్వరినే కాదు.. దాదాపు నాలుగువేల మందికి పైగా అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కో కథ. కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు, మరికొందరు రాజకీయాల్లోకి, ఇంకొందరు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించారు.
1998 నుంచి ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఎవ్వరూ పట్టించుకోలేదని..తమ గాథ ఆలకించిన నాధుడే లేడని మల్లీశ్వరీ తెలిపారు. 2009 దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కొద్ది రోజులోనే ఆయన మరణ వార్త తమని మరింత అగాధంలోకి నేటివేసిందన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఆశలు చిగురించాయన్నారు. త్వరగా తమకు పోస్టింగులు ఇస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి లేదని డీఎస్సీ అభ్యర్థి మల్లీశ్వరి అంటున్నారు.ఇప్పటికే చాలా చాలని జీతాలతో కుటుంబ పోషణ కష్ట సాధ్యమైందని, కోవిడ్ కారణంగా అనేక మంది అభ్యర్థులు మరణించారని.. వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు.
నాలుగువేల కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం
రాష్ట్ర ప్రభత్వం తీసుకున్నా నిర్ణయం వల్ల నాలుగు వేలకు పైగా కుటుంబాల…24 ఏళ్ల కల నెరవేరిందన్నారు. 1998 క్వాలిఫైడ్ డీఎస్సీ అభ్యర్థులు ఇప్పటికే చాలా మంది మరణించారు . మిగిలిన కొంతమంది అభ్యర్థులు చిరు వ్యాపారులు, కులి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంత మంది రోడ్డు పై ఫుట్ పాత్లలో టీ అమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది అభ్యర్థులకు మేలు చేకూరుతుంది. త్వరలోనే వారికి పోస్టింగ్ ఇస్తే వాళ్ళకి మెరుగైన జీవితం లభిస్తుందని బెజవాడ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంతి రాజ్ తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అభ్యర్థులు ఉన్న వారు కూడా ఉన్నారు. కొందరు అభ్యర్థులు మరణించారని వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి ఇంతి రాజ్ విజ్ఞప్తి చేశారు.
కల నెరవేరిన క్షణాలు..!
1998 డిఎస్పీలో టీచర్ల నియామకం కోసం కొందరు అర్హత సాధించి, పోస్టింగ్‌కు రాక దాదాపుపాతికేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారిపోతున్నా వారి తలరాతలు మాత్రం మారలేదు. ఈ తరుణంలో ప్రస్తుత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 1998 డిఎస్సీ అర్హులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసేందుకు అమోదం తెలిపింది. దాదాపు 4 వేలమంది అభ్యర్ధులకు ఊరటనిచ్చే ఫైల్‌పై సీఎం సంతకం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఎస్సీ అభ్యర్థులు తమ పోరాటానికి ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.