హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: పక్కింటి కుర్రాడితో బాలిక స్నేహం.. ఆరు నెలల తర్వాత షాకింగ్ సీన్

Vijayawada: పక్కింటి కుర్రాడితో బాలిక స్నేహం.. ఆరు నెలల తర్వాత షాకింగ్ సీన్

కృష్ణాజిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

కృష్ణాజిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

Krishna District: వాళ్లిద్దరిదీ తెలిసీ తెలియని వయసు.. ఆకర్షణలో చేసిన తప్పు పెద్ద సమస్య అయి కూర్చుంది. అంతేకాదు ఇద్దరి జీవితాలను ప్రమాదంలో పడేసింది. సరదాగా నానమ్మ ఇంటికెళ్లిన బాలిక.. అక్కడే ఉన్న మరో యువకుడికి దగ్గరైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

వాళ్లిద్దరిదీ తెలిసీ తెలియని వయసు.. ఆకర్షణలో చేసిన తప్పు పెద్ద సమస్య అయి కూర్చుంది. అంతేకాదు ఇద్దరి జీవితాలను ప్రమాదంలో పడేసింది. సరదాగా నానమ్మ ఇంటికెళ్లిన బాలిక.. అక్కడే ఉన్న మరో యువకుడికి దగ్గరైంది. ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) ఉయ్యారు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక చదువు మానేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. తోట్లవల్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన నాయనమ్మ ఇంటికి తరచూ వెళ్లి రెండు మూడు రోజులు అక్కడే ఉండి వచ్చేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన విద్యార్థితో బాలికకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా సాన్నిహిత్యానికి దారితీసింది.

బాలిక నాయనమ్మకు వినికిడి, దృష్టిలోపాలుండంటంతో బాలిక వచ్చినప్పుడల్లా యువకుడు కూడా ఆమె దగ్గరకు వెళ్లేవాడు. ఇదిలా ఉంటే ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెను తల్లిదండ్రులు నిరదీయగా.. జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లి మచిలీపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదు చేసిన రోజే విద్యార్థి బాలికను తీసుకొని వెళ్లిపోయాడు.

ఇది చదవండి: చనిపోయిన వ్యక్తి తిరిగొస్తే ఎలా ఉంటుందో తెలుసా..? నెల్లూరులో ఇలాగే జరిగింది..!

పేరెంట్స్ వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఐతే కంప్లైంట్ విషయం తెలుసుకున్న విద్యార్థి.. బాలికను తీసుకొచ్చి ఇంటిదగ్గర వదిలేశాడు. ఆ తర్వాత మరోసారి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థిపై పోక్సో చట్టం, కిడ్నాప్ కేసులు నమోదు చేసారు. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉంటే విద్యార్థి ఉన్న గ్రామానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Krishna District, Local News, Vijayawada

ఉత్తమ కథలు