ఆ సినిమా ప్రేరణనివ్వడం నాకెంతో ఆనందం కలిగించింది.. ఎస్సై శిరీషకు రాములమ్మ అభినందనలు..

ఆ సినిమా ప్రేరణనివ్వడం నాకెంతో ఆనందం కలిగించింది.. ఎస్సై శిరీషకు రాములమ్మ అభినందనలు..

Image-Twitter

గుర్తు తెలియని మృతదేహాన్ని తన భూజాలపై మోసుకెళ్లి.. మానవత్వాన్ని చాటుకున్నారు శ్రీకాకుళం జిల్లా కాసీబుగ్గ ఎస్సై కొత్తూరు శిరీష.

 • Share this:
  గుర్తు తెలియని మృతదేహాన్ని తన భూజాలపై మోసుకెళ్లి.. మానవత్వాన్ని చాటుకున్నారు శ్రీకాకుళం జిల్లా కాసీబుగ్గ ఎస్సై కొత్తూరు శిరీష. పోలీసులంటే కఠినంగానే కాదు.. జాలి కూడా ఉంటుందని నిరూపించారు శిరీష. ఆమె చేసిన పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రమే కాకుండా తెలంగాణ పోలీసులు కూడా శిరీషపై ప్రశంసలు కురిపించారు. నెట్టింట్లో కూడా శిరీషపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శిరీషను బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశంసించారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఓ దినపత్రికలో వచ్చిన పేపర్ క్లిపింగ్‌ను షేర్ చేసిన రాములమ్మ.. "ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు నా అభినందనలు" అని పేర్కొన్నారు.

  అంతేకాకుండా తాను నటించిన కర్తవ్యం సినిమా ప్రేరణతో ఓ తండ్రి తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని రాములమ్మ అన్నారు. ఇక, విజయశాంతి పోలీసు అధికారిణి పాత్రలో నటించిన నటించిన కర్తవ్యం సినిమా 1990లో విడుదలైంది. మోహన గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి.. అంగబలం, అర్థబలం కలిగిన రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఆ చిత్ర కథాంశం.


  ఇక, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై సునీత ఆ డెడ్ బాడీ గురించిన వివరాలు ఆరా తీశారు. అయితే వివరాలు తెలియకపోవడంతో అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే భయంతో గుర్తుతెలియని ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో ఎస్సై శిరీష స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు. ఏకంగా 2కిలోమీటర్ల మేర పొలం గట్లపై మోసుకెళ్లి అంత్యక్రియల కోసం లలితా చారిటబుల్ ట్రస్ట్ కు అప్పజెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు