హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gitam University: గీతంకు వర్సిటీ హోదా రద్దు చేయండి.. యూజీసీ, కేంద్రానికి విజయసాయిరెడ్డి లేఖ

Gitam University: గీతంకు వర్సిటీ హోదా రద్దు చేయండి.. యూజీసీ, కేంద్రానికి విజయసాయిరెడ్డి లేఖ

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

గీతం డీమ్డ్ యూనివర్శిటీ యూజీసీ ఛైర్మన్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

గీతం డీమ్డ్ యూనివర్శిటీపై యూజీసీ ఛైర్మన్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. గీతం వర్సిటీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆ లేఖలో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. యూజీసీ నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ ఛైర్మన్‌, హెచ్‌ఆర్డీ మంత్రికి సాయిరెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. యూజీసీ డీమ్డ్‌ వర్శిటీ నిబంధనలను గీతం యాజమాన్యం ఉల్లంఘించిందని సాయిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 2007 సంవత్సరంలో డీమ్డ్‌ వర్శిటీ ప్రారంభించేందుకు గీతం యాజమాన్యం యూజీసీ అనుమతి తీసుకుందన్నారు. 2008లో హైదరాబాద్‌, 2012లో బెంగళూరు ఆఫ్‌ క్యాంపస్‌ సెంటర్లు ప్రారంభించింది. విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని గీతం కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందన్న సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ ఫిర్యాదు లేఖలో ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. దూరవిద్యతో పాటు పలు యూజీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న గీతం గుర్తింపు రద్దు చేయాలని యూజీసీని కోరారు. అలాగే, విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లియేషన్ పొందేలా చూడాలని సాయిరెడ్డి కోరారు.

ఇటీవల విశాఖ గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని.. యూనివర్సిటీ ప్రహరీ గోడ(కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూలగొట్టారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు కోర్టులో ఉన్నాయని తెలిపింది. అయితే రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించినట్టుగా విచారణలో తేలిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానం మేరకు అక్రమణల తొలగింపు చేపట్టినట్టు చెప్పారు. ప్రహరీ గోడ, ప్రధాన గోడ కూల్చివేశారు. అక్రమణలో ఉన్న మరికొన్ని కట్టడాలను గుర్తించామని.. తదుపరి దశలో వాటిని కూల్చివేస్తామని చెప్పారు. అక్రమణల కూల్చివేతపై యజమాన్యానికి పూర్తి సమాచారం ఉందన్నారు. ఇక, సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు.

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. కోర్టు విచారణ సందర్భంగా... ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులివ్వకుండా పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సబబు అని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు గీతం వర్సిటీలో కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరిని కూల్చివేసిన ప్రభుత్వం... ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడం టీడీపీని లక్ష్యంగా చేసుకోవడమేనని ఆరోపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Vijayasai reddy

ఉత్తమ కథలు