Home /News /andhra-pradesh /

Andhra Pradesh: ఆనందయ్య కరోనా మందు... వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనలు

Andhra Pradesh: ఆనందయ్య కరోనా మందు... వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనలు

కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారీ (ఫైల్)

కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారీ (ఫైల్)

Andhra Pradesh: తన సొంత జిల్లా అయిన నెల్లూరులోనే ఈ మందు పంపిణీ జరుగుతుండటంతో.. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు.

  ఎంతోమంది కరోనా బాధితుల దృష్టిని ఆకర్షిస్తున్న నెల్లూరు జిల్లా ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఈ మందు కోసం వేలాది మంది ఆనందయ్య ఉంటున్న ప్రాంతానికి వస్తుండటంతో.. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా అయిన నెల్లూరులోనే ఈ మందు పంపిణీ జరుగుతుండటంతో.. దీనిపై ఆరా తీశారు. ఈ మందుపై అధ్యయనం చేయాలని ఆయుష్ ఇంఛార్జ్ మంత్రితో పాటు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌కు సూచించారు.

  అంతకుముందు ఈ ఆయుర్వేద ఔషధం విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టిపెట్టారు. దీనిపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై చర్చించారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై సైతం సీఎం పరిశీలించారు. ఈ క్రమంలో ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

  రెండు రోజుల్లో కరోనాను తగ్గిస్తూ సత్ఫలితాలిస్తుందన్న ప్రచారంతో జనమంతా కృష్ణపట్నం బాటపట్టారు. కరోనా మందు కోసం బాధితులతో పాటు వారి బంధువులు కూడా భారీగా గ్రామానికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కరోనా మందు కోసం జనం తరలివస్తున్నారు. దీంతో జనాన్ని కంట్రోల్ చేయలేక నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆక్సిజన్ తో ఉన్నవారిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతులివ్వడంతో వేలాది మంది కృష్ణపట్నంలోనే మకాం వేశారు. ఐతే రోజుకు 3వేల మందికి మాత్రమే మందు ఇవ్వగలమని నిర్వాహకుడు ఆనందయ్య చెప్తుండగా.. 10వేల మందికి పైగా గ్రామానికి చేరుకున్నారు. కృష్ణపట్నం వెళ్లే రహదారిలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

  నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య స్థానికంగా దొరికే కొన్నిరకాల ఆకులు, సగంధ ద్రవ్యాలు ఉపయోగించి కరోనా నివారణకు కషాయం, చుక్కల మందు తయారు చేస్తున్నారు. తేనే, శొంఠి, మిరియాలు, అల్లం, ధనియాలు, జిల్లేడు, తోక మిరియాలు, పిప్పట్లు, పట్టా, నల్లజీలకర్ర, పసువు, ముళ్లవంకాయ తదితర ఔషధ గుణాలున్న మొక్కలు, దినుసులు ఉపయోగించి మందు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 3వేల మందికి పైగా సొంత ఖర్చుతో తయారు చేసి మందును అందిస్తున్నారు.

  రెండు రోజుల్లోనే కరోనా తగ్గిపోతుండటం, చావు బ్రతుకుల్లో ఉన్నవారు కూడా రోజుల వ్యవధిలో పూర్తికో కోలుకుంటుండటంతో ఆ ఆయుర్వేద ఔషధం వార్త దావానంలో వ్యాపించింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే స్థానిక వైద్యాధికారులు ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా పరిశీలిస్తుండటంతో ఈ మందుకు శాస్త్రియత లభిస్తే కరోనా మహమ్మారి అంతమైనట్లేనన్న చర్చ జరుగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, ICMR, Venkaiah Naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు