జగన్ మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్... తండ్రిబాటలో నడవాలని సూచన....

తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతి సందేశానికి జగన్ సైతం ధన్యవాదాలు తెలిపారు.

news18-telugu
Updated: May 23, 2019, 11:14 PM IST
జగన్ మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్... తండ్రిబాటలో నడవాలని సూచన....
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ పార్టీ అధినేత జగన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఆయన పార్టీ తరపున గెలుపొందిన సభ్యులందరికీ వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతి సందేశానికి జగన్ సైతం ధన్యవాదాలు తెలిపారు. అలాగే జగన్ పాలనలో కొత్త పుంతలు తొక్కేలా ప్రయత్నం చేయాలని, ఏపీని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చొరవచూపించాలని వెంకయ్య అన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించడం పై సర్వత్రా హర్షం వ్యక్త మౌతోంది. ఇప్పటికే ఆయన ఈ నెల 30న ఆయన విజయవాడలో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, అలాగే ప్రధాని మోదీ కూడా జగన్‌కు ఫోసి చేసి శుభాకాంక్షలు తెలిపారు.
First published: May 23, 2019, 11:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading