Home /News /andhra-pradesh /

VERY SAD NEWS IN NEW YEAR CELEBRATIONS SOME TOURIST END THEIR LIFE IN VISAKHAPATNAM BEACH NGS VSP

Andhra Pradesh: న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చారు.. ఎంజాయ్ చేశారు.. కానీ చివరికి ఇలా అయ్యింది..

ఆర్ కే బీచ్ లో విషాదం

ఆర్ కే బీచ్ లో విషాదం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పెను విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలు జరపుకోవడానికి అని పొరుగు రాష్ట్రల నుంచి విశాఖ వచ్చారు.. అనుకున్నట్టే న్యూ ఇయర్ ను సందడిగా.. ఉత్సహంగా గడుపుకున్నారు. ఆ తీపి గుర్తులు ఎప్పటికీ ఉండిపోవాలి అనుకుంటూ చివరిగా బీచ్ కు వెళ్లి తమ టూర్ ను ముగించాలి అనుకున్నారు.. కానీ ఊహించని విషాదం వారి జీవితాలను ముగించేసింది..

ఇంకా చదవండి ...
    Visakha RK Beach: న్యూ ఇయర్ ను ఉత్సాహంగా జరపుకోవాలని అందరిలా వారు భావించారు. అందమైన పర్యాటక ప్రాంతం విశాఖలో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. సికింద్రాబాద్ నుంచి 8 మంది యువత.. ఒడిశా నుంచి ఐదుగురు విశాఖ వచ్చారు. న్యూ ఇయర్ సంబరాలను అనుకున్నట్టే సంతోషంగా జరుపుకున్నారు. చివరిగా విశాఖ బీచు అందాలను తనివితీర చూసుకుని.. అలలతో కాసేపు ఆడుకుని తమ టూర్ ను ముగించాలి అనుకున్నారు.. కానీ ఆ చిన్న కోరికే వారి జీవితాలు ముగిసిపోయేలా చేసింది. అమాంతం పైకొస్తున్న అలల్ని చూస్తే.. పై ప్రాణం పైనే వెళ్లిపోతుంది. అలాంటి అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న మనిషిని లైవ్‌లో చూస్తే.. ఎలా ఉంటుంది? అక్కడున్న వారికి అలాంటి భయానక అనుభూతే కలిగింది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆర్కే బీచ్ కు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. సికింద్రాబాద్ కు చెందిన 8 మంది యువకులు ఆదివారం మధ్యాహ్నం ఆర్కే బీచ్ చేరుకున్నారు. నీళ్లల్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా పెద్ద కెరటాలు రావడంతో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అలర్ట్ అయిన లైఫ్ గార్డ్స్ కొద్దిసేపటి తర్వాత శివను ఒడ్డుకు తీసుకురాగలిగారు. హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే లోపే తుది శ్వాస విడిచాడు. కే శివ, మహ్మద్ అజీజ్ కోసం గాలిస్తున్నారు.

    ఇక ఒడిశాకు చెందిన ఐదుగురు వ్యక్తులు కూడా గల్లంతు అయ్యారు. వీరిలో సునీత త్రిపాఠి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన శివ, అజీజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి డిసెంబర్ 30న హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. సెలబ్రేషన్స్ ముగించుకుని జనవరి 2 సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలోనే రాకాసి అలలు వారి జీవితాల్లో విషాదం నింపింది. ప్రాణాలతో బయట పడ్టవారికి ఆనందం లేకుండా చేసింది. తమతో పాటు అప్పటి వరకు ఎంజాయ్ చేసిన స్నేహితులు లేరని తెలియడంతో వారు ఆ బాధను భరించలేకపోతున్నారు.

    ఇదీ చదవండి : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా..?

    ఆనందంగా గడిపేందుకు వచ్చివారికి.. కొత్త ఏడాది ఆయుర్దాయం తీసేసింది. తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకుల దుర్మరణం తనను కలిచివేసింది అన్నారు. వారి కుటుంభాలకు తన ప్రాఘాడ సానుభూతి తెలిపారు. పిక్నిక్స్ కోసం, వీకెండ్ పేరుతో వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ముఖ్యంగా అలల్లో స్నానం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు..



    అయితే ఈ విషాదంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అక్కడ స్నానాలు చేయడం ప్రమాదకరం అని కనీస హెచ్చరిక బోర్డులు లేవని.. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు కాని.. భద్రతా సిబ్బంది కానీ అక్కడ లేకపోవడం శోచనీయమన్నారు. అలాగే లైఫ్ గార్డుకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు