VERY RARE BRAHMA KAMALAS IN KONASEEMA ONE PLANT HAVING 80 FLOWERS MORE PEOPLE WANT THAT FLOWERS NGS
Brahma kamalam: అరుదైన మొక్కకు.. 80 పూలు.. బ్రహ్మ కమలాలను చూసేందుకు ఎగబడుతున్న జనం. ప్రత్యేకతలు ఇవే.
అరుదైన బ్రహ్మకమలం
Brahma kamalam: బ్రహ్మకమలాలు కనిపించడమే చాలా అరుదు.. బ్రహ్మ కమలాలు ఎంతో ప్రత్యేకమైనవి.. ఆంధ్రప్రదేశ్ లోని ఒకే చోట 80 బ్రహ్మకమలాలు కనిపిస్తే.. చూసేందుకు కనుల పండుగగా ఉంటుంది. అందుకే వాటిని చూసేందుకు జనం చూసేందుకు ఎగబడుతున్నారు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
Rare Brahma kamalam Flower: పుష్పాలలో చాలా అరుదైనది బ్రహ్మ కమలం.. ఇది ఈ పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూస్తుంది. అందుకే దీన్ని ఎంతో ఆరుదుగా చూస్తారు. బ్రహ్మ కమలం (Bhraham kamal) అంటే బ్రహ్మ కూర్చునే పువ్వు అనే అర్థం. హైందవ సంప్రదాయంలో దీనికి చాలా విశిష్ఠత ఉంది. ఈ పుష్పం మన జనారణ్యంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. దీన్ని పెంచేవాళ్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఇది హిమాలయాల్లో (Himalayas) దొరికే చాలా అరుదైన మొక్క.. ఆ మొక్కను ఇంట్లో ఉంచితే మంచిదని హిందువులు భావిస్తారు. ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమ (Konaseema)లోనూ కనువిందు చేస్తున్నాయి. మాములుగా బ్రహ్మ కమలం ఒక పువ్వు పూసిందంటేనే జనం ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక బ్రహ్మకమలం మొక్కకి ఏకంగా పదుల సంఖ్యలో పుష్పాలు పూయడం నిజంగా ఒక అద్బుతం అనే చెప్పాలి. ఈ అద్భుత దృశ్యం తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో ఆవిష్కృతమైంది. జిల్లాలోని బిక్కవోలులో బ్రహ్మకమలం మొక్క విరగబూసింది. ఒకే ఒక్క మొక్కకు 80 పువ్వులు పూసాయి. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తున్నాయి. ఒకేసారి అన్ని బ్రహ్మ కమలాలు వికసించడంతో అక్కడ సందడి నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ ఈ చెట్టును ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు. బ్రహ్మకమలాలు ఆ మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బ్రహ్మకమలాలు.. అలాంటి పువ్వులు ఒకేసారి 80 పూయటంతో ఆ ఇంటివారు భక్తితో పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక ప్రజలు సైతం మొక్కను చూసేందుకు ఆసక్తిగా తరలివస్తున్నారు. మొక్కను దేవుడుగా భావించి హారతులు ఇచ్చి.. ప్రత్యేక పూజలు చేశారు.. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి చుట్టుపక్కల నుంచి తెలిసినవారు.. బంధువులు కూడా వచ్చి బ్రహ్మకమలాలను చూసి మురిసిపోతున్నారు.
హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాలు చూసేందుకు జనాలు ఎగబడ్డారు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది మంది ఇళ్లల్లో బ్రహ్మ కమలాలు విరబూస్తున్నాయి. కానీ ఏకంగా 80 పుష్పాలు పూయడం చర్చనీయాంశమైంది. కొన్ని మొక్కలకు మాత్రమే ఇలా భారీ పుష్పాలు వికసిస్తాయి స్థానికులు అంటున్నారు.
ఈ బ్రహ్మ కమలాన్ని ప్రకృతి ఇచ్చిన వరంగా హిందువులు భావిస్తారు. అందకే వికసించిన రోజే ఆ పుష్పానికి ప్రత్యేక పూజలు చేస్తారు. బ్రహ్మ కమలం అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినదిగా పురాణాల్లో ఉంది. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని పెద్దలు చెబుతారు. బ్రహ్మ ఉద్భవించినందునే దీన్ని బ్రహ్మకమలం అంటారు. ఈ బ్రహ్మకమలము ఒక చిత్రమైన పుష్ప రాజము. ఈ పుష్పాలతో దేవుడ్ని పూజిస్తే మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా తీరుతాయన్నది చాలామంది నమ్మకం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.