Good News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLC Graduate Electoins Result) తరువాత.. అధికార పార్టీ సైతం వ్యూహాలు మార్చే పనిలో ఉంది.. వ్యతిరేకత ఉంది అన్నవార్గాలను దగ్గరకు చేసుకునే పనిలో పడింది. ఓ వైపు సంక్షేమ పథకాలను పెంచుతోనే.. తమ పాలనపై కాస్త వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించి వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం తీరుపై ఉద్యోగస్తులు తీవ్ర అసమ్మతితో ఉన్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో ఈ సారి ఉద్యోగస్తులకు వరుస శుభవార్తలు చెపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మహిళా ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త (Good News to Wome Employees) చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తమ 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ లను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాడుకోవచ్చని జగన్ సర్కార్ తెలిపింది. వీలున్నప్పుడు ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలనే నిబంధన ఉంది. దీన్ని సవరించి మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ.. ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంపీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు వారు వినతి పత్రం ఇచ్చారు. మహిళ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్ వివరించారు. అందులో భాగంగానే మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా... ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి : వైదిస్ కొలవెరీ..? పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై అంతర్మథనం.. తప్పు ఎక్కడ జరిగింది?
దీంతో పాటు ప్రైవేటు పాఠశాలల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరారు. లేదంటే వారంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తోంది అన్నారు. దీనిపైనా సీఎం సానుకూలంగానే స్పందించారు. రెన్యువల్ ఆఫ్ రికగ్నజైషన్ ను ఎనిమిదేళ్లకు పెంచమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగానే ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందేలా చేస్తామన్నారు.. తమను గెలిపించిన వారందరికీ మేలు చేయడమే తమ లక్ష్యం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes