హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: వారందరికీ గుడ్ న్యూస్.. 3 నెలల్లో నెరవేరనున్న ఉద్దానవాసుల కల..! సాయం చేస్తున్నదెవరంటే?

Good News: వారందరికీ గుడ్ న్యూస్.. 3 నెలల్లో నెరవేరనున్న ఉద్దానవాసుల కల..! సాయం చేస్తున్నదెవరంటే?

తీరనున్న ఉద్దానం ప్రజల కల

తీరనున్న ఉద్దానం ప్రజల కల

Good News: ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు తీరబోతోంది. ఇక తమ సమస్యకు పరిష్కారం లేదా అని వారి ప్రశ్నలకు ముగింపు పడనుంది.. అది కూడా కేవలం మూడు నెలల్లోనే.. ఏం చేయబోతున్నారంటే..? ఇంతకీ ఈ ఆలోచన ఎవరిదో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18

Good News: ఉద్దానం అంటే అందరికి గుర్తు వచ్చేది కిడ్నీ సమస్యలతో (Kidney Problems) బాధపడే బాధితులే..  ఈ సమస్య ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యతో అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కొత్త పాలకులు వస్తున్నా.. వీరి సమస్యకు మాత్రం ఏళ్ల తరబడి పరిష్కారం దొరకలేదు.. ఇక తమ బతుకులు అంతే అని మదనపడుతున్న వారికి శుభవార్త.. అతి త్వరలో  వారి కోరిక నెరవేరబోతోంది. కిడ్నీ వ్యాధుల ప్రాంతంగా ఉన్న ఉద్దానంలో వైద్య పరీక్షలకు ఇక్కడే ఓ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. మాజీ సీబీఐ డైరెక్టర్, రాజకీయ నిపుణులు వి.వి. లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana), కొన్ని స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు కలిసి ఈ వైద్య పరీక్షా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. కార్పోరేట్‌ స్థాయిలో ఇక్కడ ఒక వైద్య పరీక్షల కేంద్రం ఏర్పాటు కానుంది.

జేడీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ (Janasena Party) లో పనిచేస్తున్న సందర్భంలో ఉద్దానంలో పర్యటించారు. అప్పట్లోనే ఉద్దాన వాసులకోసం ఒక డయాగ్నస్టిక్ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. అన్న మాట ప్రకారం 2022 ఏడాది చివరల్లోనే భూమి పూజ జరిగింది. ఈ వైద్య పరీక్షల కేంద్రం హామీ కార్యరూపం దాల్చి మరో మూడు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది.

ఈ  పరీక్షల కేంద్రం నిర్మాణం తర్వాత ఇక్కడ  టెలిపతీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 48 సెంట్ల స్థలంలో ఏర్పాటు అవుతున్న ఈ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. సోంపేట మండలం మండపల్లి గ్రామంలో  ఇటువంటి పరీక్షా కేంద్రం రావడం ఆ ప్రాంత వాసులకు అన్ని విధాలా ఉపయోగంలోకి రానుంది. ఇచ్చాపురం నుండి పలాస వరకూ ఉన్నవారికి ఇది సెంటర్ పాయింట్ కానుంది.

ఇదీ చదవండి : దొంగలందు ఈ దొంగలు వేరయా..? ట్రాక్టర్ రోడ్డుపై కనిపిస్తే ఏం చేస్తారో తెలుసా..?

పరీక్షా కేంద్రం ఇక్కడ ఉండడంతో  ఏడు మండలాలు (ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) 187 గ్రామాలకు చెందిన వారు వైద్య పరీక్షలు ఇక్కడే చేయించుకోవచ్చు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఉద్దాన వాసులు ఎక్కువగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతుంటారు. వీరు డయాలసిస్ మొదలుకుని.. అన్నింటికి పక్క రాష్ట్రం అయిన ఒడిషాలో బరంపురం గాని, శ్రీకాకుళం లేదా విశాఖపట్నం వెళుతుంటారు. వైద్య పరీక్షల కోసం వేలాది రూపాయలు ఖర్చులు అవుతాయి. ఇక పరీక్ష కేంద్రం మూడు నెలలో పూర్తయితే ప్రాధమిక దశలోనే అన్ని పరీక్షలు చేసి.. ఫార్మశీ ద్వారా మందులు కూడా పంపిణీ చేస్తారు.

ఇదీ చదవండి : మహిళ కానిస్టేబుల్ చెంపపై కొట్టిన వీఆర్వో.. చేయి కొరికిన మహిళా పోలీస్.. అసలు ఏం జరిగిందంటే?

నిజంగా ఈ నిర్ణయం ఈ ప్రాంతవాసులకు ఊరటగానే చెప్పొచ్చు. ముఖ్యంగా సీతయ్య ఫౌండేషన్, జెడీ లక్ష్మీనారాయణ పౌండేషన్, ఉద్దానం అసోసియేషన్ ముగ్గురు కలసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డయాగ్నిస్టిక్ సెంటర్ ఎంత తొందరగా వస్తే తమకు అంత మేలు జరుగుతుందని ఉద్దానవాసులు అంటున్నారు. మొత్తం 70 లక్షలు ఈ డయాగ్నస్టిక్ సెంటర్ కు ఖర్చు అవుతుంది. బిల్లింగ్ తో పాటు లోపల పరికరాలు అన్ని కార్పోరేట్ స్టాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు గతంలో లక్ష్మీనారాయణ వివరించారు. లండన్ నుండి వచ్చిన నిపుణులు ఈ ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Srikakulam