Diwali 2022: అందరి జీవితాల్లో ఆనందం నింపే పండుగ దీపావళి (Diwali).. ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకం. అయితే దీపావళి రోజుల్లో మాత్రమే తెరుచుకునే ప్రముఖ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? అంతేకాదు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కర్ణాటక (Karnataka) లోని హసన్ (Hasan)లో ఉన్న హసనాంబ ఆలయం తెరుచుకుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం ఏడాదిలో పది రోజులు మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైంది. ప్రతి సంవత్సరం దీపావళికి ముందు పది రోజులు మాత్రమే భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. దీంతో శక్తిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. గత రెండున్నరేళ్లూ కరోనా కారణంగా (Corona Virus) భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. కేవలం రోజుకు 100 మంది భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సారి కరోనా భయాలు తొలిగి పోవడంతో భారీగా భక్తులు వస్తున్నారు. అది కూడా కేవలం పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
హస్సన్ సిటీకి ఆ పేరు ఎలా వచ్చింది?
బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో ఉండే హస్సన్ పట్టణానికి హసనాంబ మాత ఆలయం కారణంగా హస్సన్ కు ఆ పేరు వచ్చింది. హసనాంబ అమ్మ ఎన్నో మహిమలు కల దేవత. సంవత్సరానికి ఒకే సారి మాత్రమే అమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. అక్టోబర్ చివర –నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే ఈ టెంపుల్ తెరుస్తారు. దేశం మొత్తం దీపావళి పండుగ జరుపుకొంటూ వుంటే, సరిగ్గా, దీపావళి మరుసటి రోజు అయిన బాలి పాడ్యమి నాడు మూసి వేస్తారు.
Diwali 2022 ||భక్తులను హింసిస్తే కన్నెర చేసే అమ్మవారు || దీపావళి రోజుల్ల... https://t.co/wGw8q7of3S via @YouTube #Diwali2022 #DiwaliWithMi #DiwaliSpecial #DiwaliCelebration #diwaliwishes #diwaligift #Hasan #TempleWitch
— nagesh paina (@PainaNagesh) October 24, 2022
ప్రత్యేకత ఏంటంటే?
ఒకసారి, ఏడుగురు మాతృకలు అంటే, బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో దక్షిణ భారత దేశానికి వచ్చినపుడు హస్సన్ పట్టణ అందాలకు ముగ్ధులై, ఆ ప్రదేశాన్ని తమకు నిరంతర నిలయంగా చేసుకోవాలి అనుకున్నారు. అలా మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారు. బ్రాహ్మి కేంచమ్మ యొక్క హాస కోట లోను, ఇంద్రాణి, వారాహి మరియు చాముండి దేవిగేరే హోండా లోని మూడు బావులలోను నివాసం చేసుకున్నారు.
హాసనాంబ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే దేవత..
భారతదేశంలోని ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కానీ హసనాంబ దేవాలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. హాసనాంబ అంటే హాస్యం అంటే నవ్వు అని అర్థం. అందుకే ఈ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారట అమ్మవారు. అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు.
ఇదీ చదవండి : ఆ ఊరి పేరు దీపావళి.. ఎక్కడుంది.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే..?
హింసిస్తే భరతం పట్టే అమ్మవారు..?
తన భక్తులను హింసేంచే భక్తుల భరతం పడతారనేది ఎక్కువ మంది నమ్మకం. దీని వెనుక చరిత్ర ఏమిటంటే..హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతుంటారు. దీంతో హాసనాంబ తన అత్తగారిని బండరాయిగా మారిపోమ్మని శపించిందట. అలా బండరాయిగా మారిపోయిన అత్తగారు రాయి ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచి హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూంటుదట. ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా కనుక్కోలేకపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Diwali, Diwali 2022, Hindu Temples