Danger Zone: చాలా ప్రంశాతమై.. ఆహ్లాదాన్ని పంచే విశాఖ (Viskha) మైదాన ప్రాంతం అది.. గిరిజనలు.. పర్యాటకుల (Tourists) తో ఆ ప్రాంతం కాస్త సందడిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతవైపు కన్నెత్తి చూడాలి అంటే భయపడాల్సి వస్తోంది. అందులోనూ ఒంటరిగా వెళ్తే.. ప్రాణాలు అరచేత పెట్టుకోవాల్సిందే.. ఎక్కడ అనుకుంటున్నారా.? అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluru Sitaramaraju District) పరిధిలోని అటవీ ప్రాంతం (Forest Area ).. ఎందుకంటే ప్రమాదం అంటే.. ప్రస్తుతం అక్కడ పులుల (Tigers) సంచారానికి సంబంధించి స్పష్టమైన ఆనవాళ్లు లేవు.. కానీ సమీప గ్రామాల్లో చోటుచేసుకుంటున్నఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా (Anakapalli) లోని నర్సీపట్నంకు పది కిలోమీటర్ల దూరంలోఉన్న వేములపూడి పంచాయతీ అప్పన్న పాలెంలో రెండు ఆవు పెయ్యల పై దాడిచేసి చంపేసిన ఘటన వెలుగుచూసింది. వేములపూడికి చెందిన రైతు సీహెచ్ రామారావు కుటుంబానికి అప్పన్న పాలెం సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. అందులో పాకవేసి రెండు ఆవులు, రెండు పెయ్యలను పోషిస్తున్నారు. రోజూ సాయంత్రం పాలు తీసుకుని ఆవులు, పెయ్యలను పొలంలోని చెట్లకు కట్టేసి వెళ్లిపోతారు. ఉదయం వచ్చి చూడగా రెండు పెయ్యలు చనిపోయి కనిపించాయి. అడవి జంతువు దాడిచేసి చంపేసిన ఆనవాళ్లున్నాయి. వెంటనే ఈ విషయాన్నిరామారావు పోలీసులు, అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
అనర్సీపట్నం అటవీ సెక్షన్ అధికారి సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అడవి జంతువు కాలి గుర్తులను గమనించిన ఆయన కాలి గుర్తుల ఆధారంగా పెద్దపులి అయి ఉండవచ్చని నర్సీపట్నం డీఎఫ్ఎ సూర్యనారాయణకి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెద్ద పులి రోజుకు 30 నుండి 40 కిలో మీటర్ల వరకు సంచరిస్తుందని... ప్రజలెవరూ ఒంటరిగా వెళ్లొద్దు.. అంటున్నారు అధికారులు.
ఇది ఇలా ఉంటె మాడుగుల నియోజకవర్గం పెదనందిపల్లి తారువు-మారేపల్లి పొలాల్లో పెద్దపులి సంచరింస్తోందని గ్రామస్తులు తెలిపారు. విశాఖ నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో కారులోవస్తుండగా పెదనందిపల్లి కాలనీ దాటిన తర్వాత 60 అడుగుల దూరంలో పులి రోడ్డు దాటుతుండటాన్ని చూశామన్నారు. ఈ విషయాన్ని చోడవరం రేంజర్ రామనరేష్ కు చెప్పగా.. ఉదయం సిబ్బంది తో అక్కడకు చేరుకుని పులి అడుగులు పాదాల గుర్తులు సేకరించారు.
ఇదీ చదవండి : ఆయన అభిమాని అంటే ఇట్లుంటది మరి.. వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన పత్రిక
కొద్ది రోజుల కిందట విజయనగరం జిల్లా శృంగవరపు కోట సమీపంలోని ఆండ్ర రిజర్వాయర్, తెల్లగున్నాల ప్రాంతాల్లో ఆరు మేకలను అడవి జంతువు తినేసిన ఘటన చోటుచేసుకుంది. అక్కడ మేకలపై దాడిచేసింది పులి అయితే అదే ఇటు వైపు వచ్చిఉండవచ్చని డీఎఫ్వో అధికారులు భావిస్తున్నారు. పులి సంచారం అనేది ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఎక్కడ వినలేదు చూడలేదని జనాలు భయపడుతున్నారు. దానిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tiger, Visakha